కృష్ణజింకను వేటాడారు.. | - | Sakshi
Sakshi News home page

కృష్ణజింకను వేటాడారు..

Sep 29 2026 12:45 AM | Updated on Sep 29 2026 12:45 AM

నిడుగుర్తి–లక్ష్మీపల్లి శివారులో అడవిలో కృష్ణజింకను వేటాడిన ముఠాను షాద్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.

వాతావరణం

ఆకాశం అప్పుడప్పుడు మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఎండగా ఉంటుంది. సాయంత్రం వర్షం పడే అవకాశం ఉంది.

–8లో u

మినహాయింపులపైనే చర్చ..

సర్దుబాటు ఉత్తర్వులు అందుకున్న వెంటనే కొందరు ఉపాధ్యాయులు కొత్త స్థానాల్లో చేరగా.. మరికొందరు మాత్రం ఆదేశాలను అమలు చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. కొందరికి సంఘాలు, ప్రజాప్రతినిధుల సిఫారసులతో మినహాయింపులు లభిస్తున్నాయన్న చర్చ కూడా ఉపాధ్యాయ వర్గాల్లో సాగుతోంది. కొంతమంది ఎంఈఓలు సర్దుబాటు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ.. సంబంధిత ఉపాధ్యాయులు విధుల్లో చేరకపోయినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు చర్యలు చేపడితే.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఎంఈఓలతో పాటు ఆదేశాలను అమలు చేయని ఉపాధ్యాయులపైనా చర్యలు ఉంటాయా అన్నది ప్రశ్నగా మారింది.

పరిశీలిస్తాం..

బదిలీపై వెళ్లని ఉపాధ్యాయుల అంశాన్ని పరిశీలిస్తాం. కొంతమందికి వైద్యపరమైన సమస్యలు ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. వాస్తవంగా సమస్య ఉండి విధుల్లో చేరలేని వారికి నిబంధనల మేరకు మినహాయింపు ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా విధుల్లో చేరని వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఈ వివరాలను డీఎస్సీకి నివేదిస్తాం.

– విజయకుమారి, డీఈఓ, మహబూబ్‌నగర్‌

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టినా.. ఆదేశాలు పొందిన కొందరు టీచర్లు మాత్రం కొత్త స్థానాల్లో విధుల్లో చేరడం లేదు. జిల్లాలో 244 మంది ఉపాధ్యాయులకు సర్దుబాటు కింద బదిలీ ఉత్తర్వులు జారీ చేయగా.. తొలుత 164 మంది విధుల్లో చేరారు. అనంతరం అదనపు కలెక్టర్‌ ఆదేశాలతో మరో 29 మంది చేరారు. ఇంకా 51 మంది వరకు విధుల్లో చేరాల్సి ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ.. సోమవారం వరకు ఎలాంటి చర్యలు ప్రారంభం కాలేదు. డీఈఓ విజయకుమారి పది రోజులుగా విదేశీ పర్యటనలో ఉండగా సోమవారం తిరిగి విధుల్లో చేరారు. ఇన్‌చార్జి డీఈఓగా వ్యవహరించిన ఏడీ అనురాధ సైతం ఈ అంశంపై నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. దీంతో ఉత్తర్వులు పొందినా విధుల్లో చేరని ఉపాధ్యాయులపై చర్యలు ఎప్పుడు ఉంటాయన్నది చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement