జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సీఎస్ సంజయ్‌జాజు అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారం, సురక్షిత వాతావరణం, మౌలిక వసతులు కల్పించాలన్నారు. పారిశుధ్యం, తాగునీరు, ఆహారం, ఆరోగ్యం, విద్యార్థులు–సిబ్బంది హాజరును తరచుగా తనిఖీ చేయాలని సూచించారు. తనిఖీల వివరాలు, లోపాలు, తీసుకున్న చర్యలను ఒకే సమగ్ర యాప్‌లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, మానసిక స్థితిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌ఓ నిర్మల, డీఈఓ విజయకుమారి, జిల్లా సంక్షేమాధికారులు సునీత, ఛత్రు నాయక్, తదితరులు పాల్గొన్నారు.


