పాలమూరుకు అన్యాయం చేసే డిండి ప్రాజెక్టు ఆపే బాధ్యత ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిదే అని ఎంపీ డీకే అరుణ అన్నారు. గత ప్రభుత్వంలో ఆగిపోయిన డిండి ఎత్తిపోతల పథకాన్ని మొదలుపెట్టడం అంటే ఈ ప్రాంతానికి అన్యాయం చేయడమే అన్నారు. ఈ జిల్లా నుంచి సీఎంగా బాధ్యతలు చేపట్టి ఈ ప్రాంత రైతాంగానికి పూర్తిస్థాయిలో నీళ్లు ఇవ్వాల్సింది పోయి నల్లగొండకు తరలించాలని చూడటం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. పాలమూరుకు నష్టం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని.. ప్రజల తరపున ఉద్యమిస్తామని ఆమె హెచ్చరించారు.


