కొల్లాపూర్ రూరల్: అంతర్జాతీయ కూతుర్ల దినోత్సవాన్ని పురసస్కరించుకొని ఓ తండ్రి తన కూతురుకు గుడి నిర్మించి పూజలు చేసిన ఘటన కొల్లాపూర్ మండలం చుకాయపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. రమేష్ తన కూతురు గీతికను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అయితే రెండేళ్ల క్రితం బ్రెయిన్ డ్యామేజ్ కారణంగా గీతిక (14 నెలలు) చనిపోయింది. ఈ క్రమంలో రమేష్ గ్రామానికి సమీపంలోనే శ్మశాన వాటికలో కూతురును ఖననం చేసి సమాధిపై గుడి నిర్మించి అందులో తన చిన్నారి తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. ఆదివారం అంతర్జాతీయ కూతుళ్ల దినోత్సవం సందర్బంగా చిట్టి తల్లికి ప్రత్యేక పూజలు చేసి తనతో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈఘటన అక్కడున్న వారందరి హృదయాలను కదిలించింది.


