బీసీ రిజర్వేషన్లు అమలులో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

బీసీ రిజర్వేషన్లు అమలులో ప్రభుత్వం విఫలం

Sep 28 2026 12:29 AM | Updated on Sep 28 2026 12:29 AM

● తెలంగాణ రాజ్యాధికార పార్టీ

అధ్యక్షుడు తీన్మార్‌ మల్లన్న

● 11వ రోజు కోస్గికి చేరుకున్న

మహాపాదయాత్ర

కోస్గి రూరల్‌: ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అ మలులో భాగంగా 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయకుండా హైకోర్టులో కేసులు వేయించారని, వాల్మీకి బోయలను ఎస్టీలో, ముదిరాజ్‌లను బీసీ–డీ నుంచి బీసీ– ఏలో మారుస్తారని చెప్పిన మాటలు ఎక్కడని సీఎం రేవంత్‌రెడ్డిపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్‌ మల్లన్న మండిపడ్డారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేపట్టిన మహా పాదయాత్ర గోల్కొండ కోట నుంచి వరంగల్‌ కోట వరకు 14, 500 కిలోమీటర్ల మహాపాదయాత్ర ప్రారంభమై 11వ రోజు ఆదివారం కోస్గిలో ని శివాజీ చౌరస్తాలో మాట్లాడుతూ.. కోడంగల్‌కు అద్దె ముఖ్యమంత్రి. తోక్కుకుంటూ వచ్చింది కాంగ్రెస్‌ నాయకులనే. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కోటి ఎకారాలకు సాగునీరు అందిస్తామని చెప్పిన కేసీఆర్‌ దాన్ని 2016లో నేను రిసెర్చ్‌ చేస్తే 15లక్షల సాగు మాత్రమే అవుతుందని తేలిందన్నారు. కాళేశ్వరం వల్ల మనం బతుకం.. దాన్ని మనమే సాకాల్సి వస్తదని అనాడే చెప్పానన్నారు. తీన్మార్‌ మల్లన్న ప్రచారం చేపట్టపోతే కాంగ్రెస్‌కు 20సీట్లు కూడా వచ్చేవి కావన్నారు. నేను 47 సీట్లలో ప్రచారం చేస్తే 42 వచ్చాయని, వచ్చే ఎన్నికల్లో నీ రాజకీయ సమాధి తాండూరు షాబాద్‌ బండల తోటి కట్టకపోతే నాపేరు మ్లల్లన్న కాదన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే బీసీల కులగణన పేరుతో అసెంబ్లీలో దొంగ బిల్లుపెట్టి రెడ్డిలతో హైకోర్టులో కేసులు వేసి ఆపేశారని మండిపడ్డారు. 42శాతం కాంట్రాక్ట్‌లను బీసీలకు ఇస్తామని చెప్పి రెడ్లకు అప్పగించారిని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేసి ఏడాదికి రూ.20వేల కోట్లు కేటాయిస్తామని.. ఇంతవరకు రూ.2వేల కోట్లు ఖర్చు చేయలేదన్నారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను అమలు చేసి రెడ్లకు మేలు కలిగించారన్నారు. అసెంబ్లీలో బిల్లు పెడితే రిజర్వేషన్ల విషయంలో ప్రతిపక్ష నాయకులు రావడంలేదని సాకులు చెబుతున్నారన్నారు. అసెంబ్లీ దగ్గర షర్టులిప్పి వెలమ రాజ్యం రావాలని ఓవైపు బీఆర్‌ఎస్‌ నాయకుల ధర్నాలు.. మరోవైపు 2034 వరకు నేనే సీఎం అంటూ రేవంత్‌రెడ్డిత్‌ ప్రగల్బాలు కలపడం, ఇక బీసీలకు రాజ్యాధికారం అక్కర్లేదా అంటూ మండిపడ్డారు. 1952నుంచి ఇప్పటి వరకు కోడంగల్‌లో ఒక్క బీసీ నాయకుడు ఎమ్మెల్యే కాలేదని.. 1.36లక్షల ఓట్లు బీసీలవి, 12500 రెడ్డిలవి. వాళ్ల ఓట్లు వాళ్లు వేసుకున్నా.. డిపాజిట్‌ కూడా రాదన్నారు. డిపాజిట్‌ రాని వాళ్లతో సోపతి ఏంటని ప్రశ్నాంచారు. కోడంగల్‌లో బీసీ ఓట్లు మాకొద్దని ముఖ్యమంత్రి చెబుతావా.. నీ చోటేమియా చెబుతాడా.. మీ బతుకంతా మా ఓట్ల దగ్గరనే కదా.. రేవంత్‌రెడ్డిని ఓడించే అధికారం ప్రజలు నాకిచ్చేట్టు లేరు.. వాళ్లంతకు వాళ్లే ఖతం చేసే పరిస్థితి కోడంగల్‌ దాపరించిందన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయిస్తానన్నారు. రాబోయే ఎన్నికల్లో కొడంగల్‌కు మొట్టమొదటిసారిగా బీసీ ఎమ్మెల్యే రాబోతున్నాడని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్‌, ఉపాధ్యక్షురాలు స్వర్ణక్క, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు కృష్ణ, కల్నాల్‌ బిక్షపతి, రషిద్‌పాషా, పూజిత, అనిల్‌, మహమ్మద్‌ రఫి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement