ద్రావణ తయారీలో నీటి నాణ్యత తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ద్రావణ తయారీలో నీటి నాణ్యత తప్పనిసరి

Sep 28 2026 12:29 AM | Updated on Sep 28 2026 12:29 AM

అలంపూర్‌ : పంట సాగు చేసే అన్నదాతలు సస్యరక్షణ కోసం పలు రకాల రసాయన మందులు వాడటం సాధారణం. మందులను నీటిలో కలిపి ఆ ద్రా వణాన్ని మొక్కలకు పిచికారీ చేస్తుంటారు. అయితే పురుగు మందు ద్రావణ తయారీలో నాణ్యత లోపించిన నీరు వాడితే ప్రతికూల మార్పులు జరిగి మందు ప్రభావం తగ్గుతుందని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జున రెడ్డి రైతులకు సూచించారు. నాణ్యత లేని నీటిని వినియోగిస్తే నష్టపోతారన్నారు. మందు ద్రావణం చేయడానికి నాణ్యత గల నీరు వాడినప్పుడే మాత్రమే మందు శక్తివంతంగా పని చేసి ఫలితం ఉంటుందన్నారు.

ఎలాంటి నీరు కావాలి...?

ఏ లక్షణాలు ఉండాలి...?

మందు ద్రావణం తయారికి ముఖ్యంగా మూడు లక్షణాలు అనుకూలంగా ఉండాలి. వీటిపై సరైన అవగాహన అవసరం.

1. పీహెచ్‌ ఉదజని సూచిక లేక రసాయన స్థితి :

నీటిలో కరిగి ఉండే లవణాల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఇది ఆమ్లం, తటస్థం, క్షారముగా ఉండొచ్చు. అయితే ఆమ్లగుణ తీవ్రత అధికంగా లేదా క్షారగుణ తీవ్రత అధికంగా ఉన్న నీటిని మందు ద్రావణం తయారు చేయడానికి ఉపయోగించరాదు. దీనివల్ల రసాయన ప్రతికూల మార్పులు ఏర్పడతాయి.

2. సెలినిటి లేక సాల్ట్‌ కంటెంట్‌

(లవణ పరిమాణ సూచిక)

అన్ని రకాల నీటిలోనూ కొన్ని లవణాలు కరిగి ఉంటాయి. కొన్నింటిలో ఎక్కువగానూ కొన్నింటిలో తక్కువగానూ ఉండొచ్చు. లవణాలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచి నీరుగా భావించాలి. లవణాలు అధికంగా ఉన్న నీరు మందు ద్రావణంలో కలపడానికి పనికిరావు.

3. నీటి కాఠిన్యత :

నీటిలో ఉండే లవణాల స్వభావాన్ని బట్టి పరస్పర అధిక్యతను బట్టి నీటిని రెండు రకాలుగా విభజించవచ్చు.

సాఫ్ట్‌ వాటర్‌ (మృద జలం) : సబ్బుతో సులభంగా నురగ వస్తోంది. దీనితో ఏ సమస్య ఉండదు. మందు ద్రావణ తయారికి నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.

హార్డ్‌ వాటర్‌ (కఠిన జలం): ఇందులో బై కార్పోనేట్స్‌, క్లోరైడ్స్‌, సల్ఫేట్స్‌కు సంబంధించిన కాల్షియం, మెగ్నిషియం, లవణాలు అధికంగా ఉంటాయి. ఈ నీటిలో సబ్బు వినియోగించినప్పుడు నురగ రాదు. నీరు విరిగిపోయినట్లు కనిపిస్తోంది. నురగ బాగా రావడానికి అధిక పరిమాణంలో సబ్బు వాడాల్సి వస్తోంది. ఈ నీటిని మందు ద్రావణ తయారికి వాడినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. రసాయన ప్రతికూల చర్య జరగడం వలన ద్రావణం విరిగిపోవడం గమనించవచ్చు. దీని వల్ల మందు క్రిమి సంహారక గుణం క్షిణిస్తోంది.

పాడి–పంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement