మాగనూర్: మండల కేంద్రానికి చెందిన ఓ విలేకరి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కావలి వాబయ్య (29) ఓ దినపత్రికలో రిపోర్టర్‌గా విధులు నిర్వ హిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 24న రాత్రి 8 గంటల సమయంలో వ్యక్తిగత పని నిమిత్తం నల్లగట్టకు వెళ్లి తిరిగి వస్తుండగా ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందపడటంతో తలకు తీవ్ర గాయమైంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్ద కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులకు ఇప్పుడు అలాగే చిన్న కుమారుడు సైతం ప్రమాదంలో మృత్యుఒడిలోకి చేరడంతో కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
వందేభారత్ రైలు ఢీ: మహిళ మృతి
మహబూబ్‌నగర్ క్రైం: వందే భారత్ రైలు ఢీకొట్టడంతో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు రైల్వే ఎస్‌ఐ రాజు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నగరంలో అప్పన్నపల్లి బ్రిడ్జి సమీపంలో ఆదివారం రాత్రి 7గంటల ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ(35) వందే భారత్ రైలు ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతిచెందింది. రైలు పట్టాలు దాటుతుందా? అటూ వైపు వెళ్తుందా? అనేది తెలియరాలేదని తెలిపారు. మృతదేహాన్ని జిల్లా జనరల్ ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదిలో భద్రపరిచినట్లు తెలిపారు. మృతురాలికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే రైల్వే పోలీస్‌స్టేషన్ లేదా 8712658597నెంబర్‌కు సంప్రదించాలని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
మూడిళ్లలో చోరీ
జడ్చర్ల: ఒకే రోజు మూడిళ్లలో దొంగతనం జరిగిన ఘటన శనివారం రాత్రి పట్టణంలోని కావేరమ్మపేటలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ జయప్రసాద్ కథనం మేరకు.. కావేరమ్మపేటలో నివా సం ఉంటున్న బోయని లక్ష్మమ్మ తన కుమార్తె కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇంటికి తా ళం వేసి మహబూబ్‌నగర్‌లో ఉన్న కూతురును చూసేందుకు వెళ్లింది. దీంతో దొంగలు తాళం విరగ్గొట్టి ఇంట్లో ఉన్న రూ.40 వేల నగదుతో పాటు 11 తులాల వెండి నగలు అపహరించా రు. అదే విధంగా ఆ పక్కనే నివాసం ఉంటున్న ఖైరూన్ బేగంకు సంబంధించిన గది తాళాలు విరగ్గొట్టి బీరువాలో దాచిన రూ.20వేలు, ఆ ఇంటి పక్కనే ఉన్న అలివేలకు చెందిన ఇంట్లో కూడా చొరబడి 20 తులాల వెండి గొలుసులు, రూ.15వేలు ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం తమ ఇండ్లకు వేసిన తాళాలు విరగ్గొ ట్టి ఉండడంంతో బాధితులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు న మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కారు–ఆటో ఢీ..
డ్రైవర్‌కు గాయాలు
కందనూలు: కారు–ఆటో ఢీకొని ఆటో డ్రైవర్‌కు గాయాలైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే .. నాగర్‌కర్నూల్ నుంచి ఆటో డ్రైవ ర్ మోదిన్ ఆదివారం సాయంత్రం పెద్దదగడ కు వెళ్తుండగా.. పెద్దకొత్తపల్లి మండలం నాయినపల్లి మైసమ్మ దగ్గరికి వెళ్లి తిరిగి నాగర్‌కర్నూ ల్ వైపు వస్తున్న కారు కొల్లాపూర్ చౌరస్తా సమీపంలో ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో డ్రైవరు మోదిన్ ఎడమకాలు విరిగి చేతులకు గాయాలు కాగా.. కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ఎలాంటి ఫిర్యా దు అందలేదని ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.


