హర్షవర్ధన్‌రెడ్డిని పరామర్శించిన కేటీఆర్‌ | - | Sakshi
Sakshi News home page

హర్షవర్ధన్‌రెడ్డిని పరామర్శించిన కేటీఆర్‌

Sep 28 2026 12:29 AM | Updated on Sep 28 2026 12:29 AM

● జనసంద్రంగా మారిన

సింగోటం వ్యవసాయక్షేత్రం

కొల్లాపూర్‌: కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పరామర్శించారు. ఈనెల 17న హర్షవర్దన్‌రెడ్డి తండ్రి భీరం లక్ష్మారెడ్డి అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. అంత్యక్రియలు జరిగిన మరుసటి రోజున కేటీఆర్‌ సింగోటం వచ్చి హర్షవర్దన్‌రెడ్డిని పరామర్శించి వెళ్లారు. ఆదివారం లక్ష్మారెడ్డి ఏకాదశ దినకర్మ నిర్వహించారు. కేసీఆర్‌ ఆదేశానుసారం కేటీఆర్‌ మళ్లీ రెండో సారి సింగోటంలోని హర్షవర్దన్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన ఆయనను పరామర్శించారు. లక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

పలువురి నేతల పరామర్శ..

హర్షవర్దన్‌రెడ్డిని ఆదివారం సింగోటం వ్యవసాయ క్షేత్రంలో వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కలిసి పరామర్శించారు. మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే.అరుణ, మాజీ మంత్రులు జగదీష్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, లక్ష్మారెడ్డి, పోతుగంటి రాములు, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, స్పోర్ట్స్‌ అధారిటీ చైర్మెన్‌ శివసేనారెడ్డి, బీఆర్‌ఎస్‌కు చెందిన హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, అలంపూర్‌ ఎమ్మెల్యే విజేయుడు, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, మర్రి జనార్ధన్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్‌, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు బాసు హన్మంతునాయుడు, విజయ్‌కురువ, దూరెడ్డి రఘువర్ధన్‌రెడ్డితో పాటు వివిధ పార్టీల నాయకులు హర్షవర్దన్‌రెడ్డిని పరామర్శించారు. నాయకుల రాకతో వ్యవసాయ క్షేత్రం జనసంద్రంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement