మహబూబ్‌నగర్ రూరల్: హిందూ ధర్మాన్ని విశ్వసిస్తూ, ధర్మ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాల ని అంబాత్రయ క్షేత్రం ఆదిత్య పరాశ్రీ స్వామి అన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడాలని, పరమతాలకు వెళ్లకుండా సనాతన ధర్మంపై విశ్వాసంతో ముందుకు సాగాలని ప్రజలకు సందేశమిచ్చారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలం మాచన్‌పల్లిలో హిందూ ధర్మవాహిని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ డీకే అరుణ, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆదిత్య పరాశ్రీ స్వామివారు ఆవిష్కరించారు. అనంతరం గ్రామ సర్పంచ్ వెంకటయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విగ్రహ దాత శ్రీరాంరెడ్డిని ప్రజాప్రతినిధులు అభినందించారు.
● ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం, పోరాట స్ఫూర్తి, ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకమని ఎంపీ డీకే అరుణ అన్నారు. మాచన్‌పల్లిలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించిన యువతను అభినందించారు.
– ఛత్రపతి శివాజీ మహరాజ్ ధైర్యసాహసాలు, పరిపాలనా దక్షత, మహిళల పట్ల చూపిన గౌరవం నేటి తరానికి ఆదర్శమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రతి మహిళను మాతృమూర్తిగా భావించి గౌరవించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.
● ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆశయాలు, ధైర్యసాహసాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని మా జీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. సమాజంలో ఐక్యత, ఽధైర్యం, సేవాభావాన్ని పెంపొందించేందుకు యువత ముందుండాలన్నారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు రాజుగౌడ్, నాయకులు ప్రతాప్‌గౌడ్, నాగరాజు, భరత్‌కుమార్‌రెడ్డి, రామచంద్రయ్య, గోవింద్‌యాదవ్ పాల్గొన్నారు.


