కేటీదొడ్డిలో చక్కర్లు కొట్టిన శిక్షణ విమానాలు | - | Sakshi
Sakshi News home page

కేటీదొడ్డిలో చక్కర్లు కొట్టిన శిక్షణ విమానాలు

Sep 28 2026 12:29 AM | Updated on Sep 28 2026 12:29 AM

కేటీదొడ్డి: జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండల పరిధిలో ఆదివారం ఆకాశంలో చిన్నపాటి విమానాలు చక్కర్లు కొట్టాయి. ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రమంలో శనివారం కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రారంభించిన పైలెట్‌ శిక్షణ అకాడమీ (ఓరియంట్‌ ప్‌లైట్స్‌ ఏవియేషన్‌ అకాడమీ) విమానాలు ఆదివారం ప్రత్యక్షమయ్యాయి. అకాడమీ ప్రారంభోత్సవం అనంతరం పైలెట్‌ శిక్షణలో భాగంగా నడిపిన చిన్నరకం శిక్షణ విమానాలు కేటీదొడ్డి మండల పరిసర ప్రాంతంలో ఆకాశంలో తక్కువ ఎత్తులో పలుమార్లు చక్కర్లు కొట్టాయి. పైలెట్‌ లైసెన్స్‌ సాధనకు అవసరమైన కనీస ఫ్లయింగ్‌ అవర్స్‌ పూర్తి చేసుకునే క్రమంలో భాగంగా ఈ రూట్‌లో విమానాలు నడిపినట్లు ఏవియేషన్‌ వర్గాలు తెలిపాయి. సాధారణంగా పెద్ద విమానాలు మాత్రమే చూసే స్థానికులు ఒక్కసారిగా చిన్నరకం శిక్షణ విమానాలు అకస్మాత్తుగా ఆకాశంలో చక్కర్లు కొట్టడంతో ఆసక్తిగా తిలకించారు. ఓర్వకల్లు అకాడమీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో రాబోయే కాలంలో కేటీదొడ్డి, గద్వాల పరిసర ప్రాంతాల్లో ఇలాంటి శిక్షణ విమానాలు తరుచుగా కనిపిస్తాయని స్థానికులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement