క్రమశిక్షణతో ఆడితే గెలుపు సాధ్యం | - | Sakshi
Sakshi News home page

క్రమశిక్షణతో ఆడితే గెలుపు సాధ్యం

Sep 28 2026 12:29 AM | Updated on Sep 28 2026 12:29 AM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: క్రమశిక్షణతో ఆడితే క్రీడల్లో గెలుపు సాధించవచ్చని జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు శాంతికుమార్‌ అన్నా రు. నగరంలోని ఇండోర్‌ స్టేడియంలో ఆదివారం జిల్లా జూనియర్‌ బాలికల కబడ్డీ జట్టు ఎంపికలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాంతికుమార్‌ మాట్లాడుతూ నేర్చుకున్న ఆటను ప్రదర్శిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడాలని, టోర్నీలో మెరుగైన ప్రతిభ కనబరిచి విజయాలు సాధించాలన్నారు. ఏషియన్‌ గేమ్స్‌ కబడ్డీలో దేశానికి మంచి పేరు ఉందని, ఆ ఖ్యాతిని నిలబెట్టాలని ఆకాంక్షించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్‌ మాట్లాడుతూ కబడ్డీ ఎంపికలకు జిల్లావ్యాప్తంగా 90 మంది బాలికలు హాజరవగా.. 14 మందిని, ఇద్దరిని స్టాండ్‌బైగా ఎంపిక చేశామన్నారు. వీరికి ప్రత్యేక కోచింగ్‌ క్యాంప్‌ నిర్వహిస్తామన్నారు. ఎంపికై న జట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో వచ్చేనెల 10 నుంచి 12 వరకు జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీలో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు ముత్యం గురుస్వామి, ఉమామహేశ్వర్‌రెడ్డి, బాలరాజయ్య, మేరిపుష్ప, పాపారాయుడు, శ్రీనివాసులు, గణేష్‌, కోచ్‌ శివప్రసాద్‌, పీడీలు శ్రీనివాసులు, రజని, శ్వేత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement