సాంకేతికతకు అనుగుణంగా చట్టాలు మారాలి | - | Sakshi
Sakshi News home page

సాంకేతికతకు అనుగుణంగా చట్టాలు మారాలి

Sep 27 2026 1:04 AM | Updated on Sep 27 2026 1:04 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: సాంకేతికతకు వ్యాప్తికి అనుగుణంగానే చట్టాలు మారాలని స్టేట్‌ హ్యయర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌ బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు పీయూ లా కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టెక్నాలజీ ఆండ్‌ లా అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విమానయానం, అంతరిక్షం, రక్షణ, సముద్రరంగం, ఐటీ, మేధో సంపత్తి వంటి రంగాల్లో న్యాయనిపుణులకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని, ఇందులో న్యాయపరమైన అంశాల్లో వచ్చే వివాదాలను పరిష్కరించేందుకు వారి పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక రంగం వ్యాప్తంగా చెందుతున్న నేపథ్యంలో న్యాయ విద్యార్థులు కూడా తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా సర్టిఫీకెట్‌ కోసం కాకుండా జ్ఞానం కోసం చదవాలని, క్రమం తప్పకుండా తరగతులకు హాజరుకవడంతో చాలా వరకు సబ్జెక్టు పెరుగుతుందని తెలిపారు. పాలమూరు ప్రాంతంతో తమకు మంచి అనుభందం ఉందని, పీయూను దత్తత తీసుకుని అన్నిరంగాలుగా అభివృద్ధి చెందేందుకు సహకరిస్తామన్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన లా, ఇంజనీరింగ్‌ కళాశాలల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తామన్నారు. కార్యక్రమాల్లో రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు, ఆడిట్‌సెల్‌ డైరెక్టర్‌ చంద్రకిరణ్‌, ప్రిన్సిపాల్‌ భూమయ్య, కరుణాకర్‌రెడ్డి, ఈశ్వర్‌కుమార్‌, శివచరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

హాస్టల్‌ ఏర్పాటు చేయాలని వినతి

పీయూలో నూతనంగా ఏర్పాటు చేసిన లా, ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులకు వెంటనే హాస్టల్‌ సదుపాయం కల్పించాలని కోరుతూ స్టేట్‌ హ్యయర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌ బాలకిష్టారెడ్డికి విద్యార్థి సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. అందుకు ఆయన స్పందిస్తూ సమస్య పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement