చాకలి ఐలమ్మ నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత | - | Sakshi
Sakshi News home page

చాకలి ఐలమ్మ నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత

Sep 27 2026 12:58 AM | Updated on Sep 27 2026 12:58 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): చాకలి ఐలమ్మ నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత అని కలెక్టర్‌ శ్రీమతి ఖుష్బూగుప్తా అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా శనివారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌హాల్‌లో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రపంచానికి తెలంగాణ తెగువను పోరాట పటిమను పరిచయం చేసిన చాకలి ఐలమ్మను స్మరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆమె ఆశయాలను కొనసాగిస్తామని, భావితరాలకు ఆమె చరిత్రను అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఇంటా చాకలి ఐలమ్మ విజయగాధ ప్రతి ధ్వనిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ హరిప్రియ, డీఆర్‌ఓ నిర్మల, ఏఓ సువర్ణ రాజ్‌, డీటీ రాజీవ్‌రెడ్డి, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement