రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం

Sep 26 2026 1:20 AM | Updated on Sep 26 2026 1:20 AM

గద్వాల క్రైం: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం నదిఅగ్రహారం రోడ్డు మార్గంలో చోటు చేసుకుంది. గద్వాల పట్టణానికి చెందిన వడ్డె శ్రీను(51), ఈశ్వరన్న వ్యక్తిగత పని నిమిత్తం నదిఅగ్రహారానికి వెళ్లారు. బైక్‌పై సాయంత్రం గద్వాల వైపునకు వస్తుండగా, ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో ఎదురుగా వస్తున్న కుక్కను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని వేగంగా ఢీ కొట్టాడు. ప్రమాదంలో వడ్డె శ్రీను అక్కడికక్కడే పడి మృతి చెందాడు. ఈశ్వరన్నకు తీవ్ర రక్తగాయాలు కాగా, గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు.

గుర్తు తెలియని

రైలు ఢీకొని.. ఒకరు మృతి

గద్వాల క్రైం:గుర్తు తెలియని రైలు ఢీ కొని ఒక రు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చే సుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. గ ద్వాల మండలం మెల్లచేర్వు గ్రామానికి చెంది న రాజు(45) కూలీ పనులు చేస్తు జీవనం సా గిస్తున్నాడు.అయితే తెల్లవారు జామున కాల్య కృత్యాల కోసం సమీపంలోని రైల్వే ట్రాక్‌ వైపునకు వెళ్లగా, ఈ క్రమంలో గుర్తు తెలియని రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజు అక్కడికక్క డే పడి మృతి చెందాడు. ఘటనపై భార్య మార్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు రైల్వే కానిస్టేబుల్‌ నర్సింహులు తెలిపారు.

జీపీ ట్రాక్టర్‌ బోల్తా:

డ్రైవర్‌ మృతి

రాజాపూర్‌: మండలంలోని కుత్నేపల్లి పంచాయతీకి చెందిన ట్రాక్టర్‌ బోల్తాపడి జీపీ కార్మికుడు పులి రఘు (45) మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు.. కుత్నేపల్లికి చెందిన పులి రఘు కొన్నేళ్లుగా పంచాయతీ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ గ్రామంలోని చెత్తను సేవరించడంతో పాటు హరితహారం మొక్కలకు నీళ్లు పోసేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి పంచాయతీ పరిధిలోని బోడగుట్టతండాలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా భోజనం చేసిన తర్వాత ఖాళీ ప్లేట్లు వేసేందుకు ట్రాలీ తీసుకెళ్తుండగా.. ప్రమాదవశాత్తు గ్రామ శివారులో ట్రాక్టర్‌ బోల్తాపడటంతో ఇంజన్‌ కింద ఇరుక్కుని డ్రైవర్‌ రఘు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య కవిత, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపారు.

భీమా కాల్వలో

మునిగి రైతు మృతి

వనపర్తి రూరల్‌: బీమా కాల్వలో మునిగి ఓ రైతు మృతి చెందాడు. ఎస్‌ఐ హృషికేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నాచహళ్లి గ్రామానికి చెందిన మిద్దె అబ్దుల్లా (46) శుక్ర వారం సాయంత్రం కాలువ వద్దకు వెళ్లాడు. గ్రామంలోని చెరువులోకి నీటిని పంపింగ్‌ చేసేందుకు ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ మోటా రు నుంచి నీరు సరిగా రాకపోవడంతో కాల్వలోకి దిగి పరిశీలించాడు. ఈ క్రమంలో నీటిలో ని ఫుట్‌బాల్‌ వద్ద పేరుకుపోయిన చెత్తను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో ముని గి ఊపిరాడక మృతి చెందాడు. మృతుడి భార్య మిద్దె మన్నెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

హైందవి కళ్లు దానం

జడ్చర్ల టౌన్‌: ప్రమాదవశాత్తు భవనంపైనుంచి పడి మృతిచెందిన పాలా ది హైందవి కళ్లను ఎల్‌వీప్రసాద్‌ ఐ ఆస్పత్రికి దా నం చేశారు. తమ కూతు రు మృతిచెందడంతో పాలాది రామ్మోహన్‌, సారిక దంపతులు కళ్ల ను దానం చేయాలని రెడ్‌క్రాస్‌కు సమాచా రం అందించారు. సమాచారం అందుకున్న రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ నటరాజ్‌, ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి టెక్నీషియన్‌ శివ స్పందించి శుక్రవారం ఉదయం హైందవి కళ్లకు సంబంధించిన కార్నియాను సేకరించారు. కుటుంబ సభ్యులకు కార్నియా సేకరించిన ధ్రువీకరణ పత్రం అందజేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 276మంది తమ కార్నియాను దానం చేసి 552మందికి చూపు కల్పించారని తెలిపారు.

కాపరిని బలి తీసుకున్న లారీ

మక్తల్‌: గొర్రెలను మేపుతున్న కాపరి లారీ ఢీకొని మృతి చెందిన ఘటన మండలంలోని బోదంలకుంట స్టేజీ సమీపంలో గు రువారం చోటుచేసుకుంది. ఊట్కూర్‌ మండలం ఏడివెళ్లి గ్రామానికి చెందిన నాగరాజు (30) గొర్రెలను పొలం వద్ద మేపుతున్నాడు. ఈ క్ర మంలో గొర్రెలు రోడ్డుపైకి వెళ్లడంతో వాటిని అదుపు చేసేందుకు నాగరాజు రోడ్డుపైకి వెళ్లా డు.అదే సమయంలో అటుగా వచ్చిన లారీ అ తడిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందా డు. సమాచారం అందుకున్న మక్తల్‌ పోలీసు లు ఘటనా స్థలానికి చేరుకుని లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement