తిమ్మాజిపేట: యువ టూరిజం క్లబ్ పాఠశాల, కళాశాలల స్థాయిలో తెలంగాణ పర్యాటక ప్రదేశాలు, సాంస్కృతిక వారసత్వం వంటి పోటీల్లో తిమ్మాజిపేట విద్యార్థి నోహాకు జిల్లా స్థాయి ప్రథమ బహుమతి సాధించాడు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో గురువారం షార్ట్ ఫిలీంలు చేశారు. ఈ పోటీల్లో తిమ్మాజిపేట ప్రభుత్వ కళాశాల విద్యార్థి నోహా ప్రథమ బహుమతి గెలుచుకోవడంతో శుక్రవారం స్థానిక కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్ అనసూయ విద్యార్థిని నోహాను శాలువాతో సత్కరించి అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ బహుతి తీసుకొచ్చి కళశాల, తిమ్మాజిపేటకు మంచిపేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నిమజ్జనంలో అపశ్రుతి.. హైదరాబాద్ వాసి మృతి
కొల్లాపూర్ రూరల్: గణేశ్ విగ్రహ నిమజ్జనానికి వచ్చిన ఓ వ్యక్తి కృష్ణానదిలో మునిగి గల్లంతై మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. కొల్లాపూర్ ఎస్‌ఐ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఉప్పుగూడ నుంచి ప్రత్యేక వాహనంలో గణేశ్ విగ్రహాన్ని సోమశిల కృష్ణానది వద్దకు తీసుకొచ్చిన బృందం నిమజ్జనానికి ముందు నదిలో స్నానం చేసేందుకు దిగింది. అందరూ ఒడ్డుకు సమీపంలోనే ఉండగా రాజు(40) మాత్రం లోతైన ప్రాంతంలోకి వెళ్లాడు. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది లోపలికి వెళ్లవద్దని హెచ్చరించినప్పటికీ అతడు ముందుకు వెళ్లడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టి రాజు మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. బృంద సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లోతైన, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లొద్దని, నదీ తీరంలో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా పాటించాలని ఎస్‌ఐ ఆనంద్ ప్రజలకు సూచించారు.


