చాలా విషయాలుతెలుస్తున్నాయి | - | Sakshi
Sakshi News home page

చాలా విషయాలుతెలుస్తున్నాయి

Sep 25 2026 1:17 AM | Updated on Sep 25 2026 1:17 AM

అంగన్‌వాడీ కేంద్రంలో ఆకుకూరలు, కూరగాయల్లో ఉండే పోషకాల గురించి చెబుతున్నారు. నాకు కొన్ని ఆకుకూరలు మాత్రమే తెలుసు. ఇప్పుడు చాలా రకాలున్నాయని తెలిసింది. వాటిని ఎలా వండుకొని తినాలో కూడా వివరిస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉంది.

– ఐశ్వర్య, లబ్ధిదారు, మహబూబ్‌నగర్‌

పౌష్టికాహారం అందిస్తున్నాం

అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నిత్యం అవగాహన కల్పిస్తున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రతిరోజూ ఒక్కో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆరోగ్య సూత్రాలను పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం. పౌష్టికాహారం అందిస్తున్నాం. – మంజురాణి,

అంగన్‌వాడీ టీచర్‌, టీడీగుట్ట, మహబూబ్‌నగర్‌

ప్రాధాన్యత వివరిస్తున్నాం

అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పోషకాహార విలువలపై నెల రోజుల పాటు పోషణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నాం. ప్రతిరోజూ వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. అంగన్‌వాడీ టీచర్లు చేపడుతున్న కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నాం.

– వసీమ్‌ సుల్తానా, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement