4 ఆస్పత్రులు.. పుట్టిన పాప.. తల్లి మృతి | - | Sakshi
Sakshi News home page

4 ఆస్పత్రులు.. పుట్టిన పాప.. తల్లి మృతి

Sep 25 2026 1:17 AM | Updated on Sep 25 2026 1:17 AM

పాలమూరుకు తరలింపు.. మృతి

● ప్రసవ వేదనతో వచ్చిన శ్వేతకు

సిజేరియన్‌.. ఆ తర్వాత తీవ్ర రక్తస్రావం

● నారాయణపేట నుంచి పాలమూరుకు తరలింపు.. చికిత్స పొందుతూ మృతి

● వైద్యుల నిర్లక్ష్యమే కారణమని

కుటుంబ సభ్యుల ఆరోపణ

● బాలింత ప్రాణం ఖరీదు రూ.10 లక్షలు?

నారాయణపేట: ఒకవైపు పండంటి ఆడబిడ్డ పుట్టిందన్న ఆనందం.. మరోవైపు కొద్దిగంటల్లోనే తల్లి మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. నవ మాసాలు మోసిన తల్లి.. బిడ్డను చూసిన కొద్దిసేపటికే మృత్యువాత పడింది. ఊట్కూర్‌ మండలం సామనూర్‌కు చెందిన శ్వే త (20)కు బుధవారం ప్రసవ వేదన రావడంతో కు టుంబ సభ్యులు నారాయణపేటకు తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి.. అ క్కడి నుంచి గాయత్రి ఆస్పత్రికి తరలించారు. సిజే రియన్‌ ద్వారా ఆడబిడ్డ జన్మించింది. అనంతరం తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించింది. మెరుగైన చికిత్స కోసం మహబూబ్‌నగర్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ శ్వేత మృతి చెందింది.

ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ప్రైవేట్‌కు..

శ్వేతకు బుధవారం ఉదయం 11 గంటల సమయంలో పురిటినొప్పులు రావడంతో దామరగిద్ద మండలం మద్దెల్‌బీడు నుంచి కుటుంబసభ్యులు నారాయణపేట జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ సకాలంలో వైద్యం అందలేదని కుటుంబసభ్యులు ఆరోపించారు. నొప్పులు అధికం కావడంతో మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో యాద్గీర్‌ రోడ్డులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సాధారణ ప్రసవానికి ప్రయత్నించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సుమారు రెండు గంటలపాటు ప్రయత్నించినా పరిస్థితి అనుకూలించకపోవడంతో గాయత్రి ఆస్పత్రికి తరలించాలని సూచించినట్లు పేర్కొన్నారు.

3.03 గంటలకు సిజేరియన్‌

మధ్యాహ్నం 2.50 గంటల ప్రాంతంలో శ్వేతను గాయత్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించిన అనంతరం ఆపరేషన్‌ థియేటర్‌కు తరలించా రు. సుమారు 3.03 గంటలకు సిజేరియన్‌ చేయ గా ఆడశిశువు జన్మించింది. అనంతరం శ్వేతకు రక్తం తక్కువగా ఉందని, రెండు యూనిట్ల రక్తం అవసరమని వైద్యులు చెప్పినట్లు కుటుంబ సభ్యు లు తెలిపారు. రక్తం ఎక్కించినా రక్తస్రావం ఆగలేదని, పరిస్థితి విషమించడంతో మహబూబ్‌నగర్‌కు తరలించాలని వైద్యులు సూచించినట్లు చెప్పారు.

సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ప్రత్యేక అంబులెన్స్‌లో శ్వేతను మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రెండు, మూడు గంటల చికి త్స అనంతరం శ్వేత మృతి చెందినట్లు వైద్యు లు తెలిపారని వారు పేర్కొన్నారు. బిడ్డ పుట్టిన ఆనందంలో మునిగిపోవాల్సిన కుటుంబం.. కొద్దిగంటల్లోనే శోకసంద్రంలో మునిగిపోయింది. తల్లి ఒడిలో ఉండాల్సిన పసిబిడ్డ.. అమ్మను కోల్పోయింది. నవజాత శిశువును చేతుల్లోకి తీసుకున్న బంధువుల కళ్లలో నీళ్లు తిరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement