కోట్ల వెంకటేశ్వరరెడ్డికి ప్రతిభా పురస్కారం | - | Sakshi
Sakshi News home page

కోట్ల వెంకటేశ్వరరెడ్డికి ప్రతిభా పురస్కారం

Sep 25 2026 1:17 AM | Updated on Sep 25 2026 1:17 AM

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రతి ఏడాది ఇచ్చే ప్రతిభ పురస్కారానికి ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వరరెడ్డి ఎంపికయ్యారు. కవితా విభాగంలో జిల్లాకు చెందిన కవి కోట్ల వెంకటేశ్వరరెడ్డి 40 ఏళ్లుగా వచన కవిత్వం రాస్తున్నారు. ఇప్పటివరకు 17 వచన కవితా సంపుటాలను వెలువరించారు. వచ్చేనెల 3వ తేదీన కోట్ల వెంకటేశ్వరరెడ్డి ప్రతిభా పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈయన 2019లో కాళోజీ పురస్కారాన్ని అందుకున్నారు. కోట్ల వెంకటేశ్వరరెడ్డికి ప్రతిభా పురస్కారం లభించడం పట్ల పాలమూరు సాహితీ అధ్యక్షడు డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్‌ ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement