స్టేషన్ మహబూబ్‌నగర్: ఒక వైపు వర్షం.. మరోవైపు భక్తిసాగరం..గణపతి బొప్పా మోరియా.. జైబోలో గణేష్ మహరాజ్‌కీ జై.. నినాదాలతో నగరం మొత్తం హోరెత్తింది. మహిళల కోలాటాలు.. చిన్నారుల నృత్యాలు.. పెద్దల చెక్క భజనలు.. యువకుల కర్రసాము.. డప్పుల మోతలు.. మిరుమిట్లు గొలిపే లైట్ల మధ్య జోరు వర్షంలోనూ నిమజ్జనోత్సవం కనులపండువగా సాగింది. పది రోజులుగా విశేష పూజలందుకొన్న విఘ్నాధిపతి.. ఇక వెళ్లొస్తా అంటూ గంగమ్మ ఒడికి చేరాడు. బుధవారం రాత్రి జిల్లాకేంద్రంలోని క్లాక్‌టవర్ చౌరస్తా నుంచి అటు పాత గ్రంథాలయం దాకా.. ఇటు పాత బస్టాండు, రాయచూ రు రోడ్డు, జడ్చర్ల హైవే ప్రాంతాలు గణపతి విగ్రహాల ఊరేగింపు లతో పులకించిపోయాయి. బాలగంగాధర్‌తిలక్ విగ్రహం వద్ద గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ధ్వజారోహణ చేశారు. ఈ సందర్భంగా ఈ ఏడాది గణేష్ ఉత్సవాల సావనీర్‌ను ఆవిష్కరించారు. క్లాక్‌టవర్ చౌరస్తా నుంచి అటు పాత గ్రంథాలయం దాకా, ఇటు పాత బస్టాండు, రాయచూరు రోడ్డు, జడ్చర్ల హైవే తదితర ప్రాంతాలు నిమజ్జనానికి తరలివెళ్లే గణపతి విగ్రహాల ఊరేగింపులతో పులకించిపోయాయి. క్లాక్‌టవర్ చౌరస్తా చుట్టుపక్కల ప్రాంతాలు జాతరను తలపించాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మరోవైపు జడ్చర్లలో శోభాయాత్ర ప్రశాంతంగా సాగింది. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి నేతాజీ చౌరస్తాలో గణనాథులకు స్వాగతం పలికారు.
గంగమ్మ ఒడికి గణనాథుడు
నగరంలో శోభాయమానంగా సాగిన నిమజ్జనోత్సవం
కోలాటాలు, భజనలతో సందడిగా మారిన పాలమూరు
క్లాక్‌టవర్‌లో విగ్రహాలకు స్వాగతం పలికిన ఉత్సవకమిటీ
వర్షంలోనూ ఆడిపాడిన భక్తులు


