గడువులోగా సర్‌ ప్రక్రియ పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా సర్‌ ప్రక్రియ పూర్తిచేయాలి

Sep 24 2026 2:12 AM | Updated on Sep 24 2026 2:12 AM

జర్ల టౌన్‌: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పారదర్శకంగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్‌, జడ్చర్ల అసెంబ్లీ ఈఆర్‌ఓ హరిప్రియ ఆదేశించారు. బుధవారం తహసీల్దార్‌ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయపార్టీల నాయకులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. నోటీసుల పంపిణీ, విచారణ పురోగతిని ఆమె అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు 93.59శాతం నోటీసుల పంపిణీ అయ్యాయని, వాటిలో 45.33 శాతం విచారణ పూర్తయ్యాయని వివరించారు. మిగిలిన విచారణను నిర్దేశిత షెడ్యూల్‌ ప్రకారం త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. ఏఈఆర్‌ఓ లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్న ఫారం 6 కొత్త ఓటరు నమోదు, ఫారం 7 ఓటరు తొలగింపు, ఫారం 8 ఓటరు వివరాల సవరణ దరఖాస్తులు పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. ఏవైనా సమస్యలుంటే వాటిని అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఓటర్లకు అవసరమైన అవగాహన కల్పించి విచారణకు హాజరయ్యేలా సహకరించాలన్నారు. ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా పూర్తయ్యేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ నర్సింగ్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ గిరీష్‌, అదనపు తహసీల్దార్‌ అజయ్‌, ఎన్నికల డీటీ మహబూబ్‌ అలీతోపాటు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులు శ్రీకాంత్‌, మినాజ్‌, అమర్‌నాథ్‌గౌడ్‌, ఇంతియాజ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement