చివరి విగ్రహం వరకు పోలీసుల బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

చివరి విగ్రహం వరకు పోలీసుల బందోబస్తు

Sep 24 2026 2:12 AM | Updated on Sep 24 2026 2:12 AM

మహబూబ్‌నగర్‌ క్రైం: జిల్లాకేంద్రంలో గణనాథులు బుధవారం నిమజ్జనానికి తరలివెళ్లారు. రాత్రి 9 గంటల నుంచి నగరంలోని ప్రధాన గణనాథులు శోభాయాత్రగా క్లాక్‌టవర్‌ వద్ద ఏర్పాటు చేసిన స్వాగత వేదికకు చేరుకుని, అక్కడి నుంచి వివిధ చెరువులకు తరలించారు. శోభాయాత్ర సందర్భంగా నగరంలో 506 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా ప్రధానకూడళ్లలో సిబ్బందిని మోహరించడంతో పాటు భారీ వాహనాలను బైపాస్‌ మార్గాల వైపు మళ్లించారు. నిమజ్జన ప్రాంతాలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పికెట్లు, రూఫ్‌టాప్‌ బందోబస్తు, పెట్రోలింగ్‌, స్ట్రైకింగ్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. మఫ్టీలో 20 మంది స్పెషల్‌ బ్రాంచ్‌ సిబ్బందిని నియమించారు. నగరంలో బందోబస్తును ఎస్పీ డి.జానకి స్వయంగా పర్యవేక్షించారు. క్లాక్‌టవర్‌తోపాటు ప్రధాన కూడళ్లు, గణనాథుల మండపాలను పరిశీలించారు. అదనపు ఎస్పీ ఎన్‌.బి.రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి సిబ్బందికి సూచనలు చేశారు. చివరి విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నిబంధనలు పాటించాలని, డీజేలు, ఇతర సౌండ్‌ సిస్టమ్స్‌కు అనుమతి లేదని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎలాంటి గొడవలకు తావివ్వకుండా సంయమనం పాటించాలని, నిమజ్జనం సందర్భంగా రోడ్లపై చెత్త వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement