కృష్ణమ్మ ఒడిలోకి గణనాథులు | - | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మ ఒడిలోకి గణనాథులు

Sep 19 2026 12:58 AM | Updated on Sep 19 2026 12:58 AM

బీచుపల్లికి భారీగా తరలివచ్చిన విగ్రహాలు

ఇటిక్యాల: గణేశ్‌ ఉత్సవాల్లో భాగంగా ఐదురోజులపాటు విశిష్ట పూజలు అందుకున్న గణనాథులను శోభాయాత్రగా తరలించి బీచుపల్లి వద్ద కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. శుక్రవారం ఐదోరోజు కావడంతో నిమజ్జనం కోసం వివిధ ప్రాంతాల నుంచి గణనాథులను బీచుపల్లి వద్దకు తీసుకువచ్చారు. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రేన్ల సహాయంతో అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు దాదాపు 100 గణనాథులను కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. నిమజ్జనం ప్రాంతాన్ని సీఐ ప్రదీప్‌కుమార్‌ సందర్శించి పలు సూచనలు చేశారు. బీచుపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌జాం కాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిబ్బందితో నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహించాలని ఇటిక్యాల ఎస్‌ఐ రవినాయక్‌కు గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement