రేపల్లెలో పోలీస్‌ పికెటింగ్‌ | - | Sakshi
Sakshi News home page

రేపల్లెలో పోలీస్‌ పికెటింగ్‌

Sep 12 2026 1:12 AM | Updated on Sep 12 2026 1:12 AM

గద్వాల క్రైం: గద్వాల మండలం రేపల్లెకు చెందిన దళిత రంగముని, బోయ మహేశ్వరి ఇద్దరు మేజర్లు కావడంతో కులాంతర వివాహ చేసుకున్న ఘటనపై అమ్మాయి కుటుంబ సభ్యులు గురువారం అబ్బాయి కుటుంబ సభ్యులు ఇళ్లను కూల్చివేసిన ఘటన విధితమే.. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచనలం సృస్టించింది. ఈ మేరకు జిల్లా పోలీసుశాఖ రేపల్లెలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసు పికెటింగ్‌ను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంచనీయ ఘటనలు తలెత్తకుండా పట్టిష్టమైన బదోబస్తు నిర్వహించారు. గ్రామంలో అనుమానిత వ్యక్తుల వివరాలను తెలుసుకున్నారు. రెండు సామాజిక వర్గాలకు చెందిన నివాస గృహాల్లోని బంధువుల వివరాలను ఆరా తీశారు. ఇళ్లు కూల్చివేత సమయంలో ఎంతమంది వచ్చారు. కూల్చివేతకు ఉపయోగించిన వాహనాలు, వాటిని గ్రామంలోకి తీసుకొచ్చిన వ్యక్తులేవరు..? ప్రస్తుతం వాహనాలు ఎక్కడున్నాయి.? తదితర అంశాలపై బృందాలుగా వీడిపోయి కూపీ లాగారు. బాధిత కుటుంబ సభ్యులపై దాడులు, బెదిరింపులు, భయభ్రాంతులకు గురి చేసిన వ్యక్తుల వివరాలను సేకరించారు. కూల్చివేతకు వచ్చిన క్రమంలో మారణాయుధాల వంటివి ఉపయోగించారనే విషయాలపై గ్రామస్తులను అడిగి తెలుసున్నారు.

ఆగ్రహం వ్యక్తం

కులాంతర వివాహాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహించి ఆర్థిక వెసులుబాటును కల్పిస్తుందని ఎమ్మార్పీస్‌, సీపీఎం జిల్లా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో అసమానతలను నివారించి మతం, జాతీ భేదం లేకుండా ఉంటున్న గ్రామాల్లో ఎస్సీ కులానికి చెందిన అబ్బాయి బీసీ కులానికి చెందిన యువతిని పెళ్లి చేసుకోవడం చట్ట వీరద్దమైన ఘటనగా మారిందన్నారు. ఇలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడిన నిందితులు, ఘటనకు కారకుడైన సర్పంచ్‌ను కూడా అరెస్టు చేయాలన్నారు. బాధిత కుటుంబానికి రూ.50లక్షల నష్ట పరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా ఉన్నతధికారులు గ్రామాన్ని సందర్శించి దళితులకు ఆత్మస్థైర్యాన్ని కల్పించి, రక్షణ ఇవ్వలన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎస్పీ శ్రీనివాసరావుకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వెంకటస్వామి, కుర్మన్న, రాజు, పరుశరాము, కన్నా, శ్రీనివాసులు, ఇమ్మానియేలు, ఆశన్న, పరంజ్యోతి తదితరులు ఉన్నారు.

ఇళ్లు కూల్చిన నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసులు

పోలీసుల అదుపులో నిందితులు

ఆగ్రహ వక్తం చేసిన ఎస్సీ, ఎస్టీ, సీపీఎం సంఘాల నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement