ఐదురోజుల పనివిధానం అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఐదురోజుల పనివిధానం అమలు చేయాలి

Sep 12 2026 1:12 AM | Updated on Sep 12 2026 1:12 AM

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: ప్రభుత్వం ఐదు రోజుల బ్యాంకింగ్‌ విధానాన్ని అమలు చేయాలని పలు బ్యాంక్‌ ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. ఐదు రోజుల బ్యాంకింగ్‌ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ పిలుపుమేరకు మహబూబ్‌నగర్‌లోని టీటీడీ కల్యాణ మండపం ఎదుట శుక్రవారం అఖిల భారత బ్యాంకు సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెలో ఆయా బ్యాంకుల ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గతంలో ఐదు రోజుల బ్యాంకింగ్‌ పనివిధానం అమలు చేస్తామని అంగీకారం తెలిపినప్పటికీ ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు. వెంటనే ఐదు రోజుల పనివిధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. న్యాయమైన, సముచితమైన పీఎల్‌ఐ విధానాన్ని అమలు చేయాలని కోరారు. అనంతరం అక్కడి నుంచి మల్లికార్జున చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్‌, అంబేడ్కర్‌ చౌరస్తా మీదుగా తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. సమ్మెలో ఆయా బ్యాంక్‌ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తిరుమల్‌రెడ్డి, రాజేష్‌, జయకర్‌, సోంభూపాల్‌, రాంభూపాల్‌రెడ్డి, సూర్యప్రకాశ్‌రెడ్డి, నరేష్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్‌ ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు సీఐటీయూ నాయకులు కిల్లె గోపాల్‌, సీపీఎం నాయకులు రాములు, ఎల్‌ఐసీ ఉద్యోగ సంఘం నాయకులు రాజేశ్వర్‌, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్‌ అఖ్తర్‌ తదితరులు సంఘీభావం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement