నవాబుపేట: పాలమూరు బిడ్డ సీఎం అయ్యిండని సంతోషిస్తాం.. కానీ సీఎం పదవికి తగ్గట్లు హుందాతనంగా మాట్లాడటం నేర్చుకో.. ముందు నీ భాష మార్చుకో అప్పుడు జిల్లా వాసిగా సంతోషిస్తాం.. అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలపై బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సూచించారు. గురువారం నవాబుపేటలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. పాలమూరు ఆత్మగౌరవం నిలబెట్టే నాయకుడివైతే మీ పనితీరులో మార్పు రావాలని, భాష మార్చుకోవాలంటూ హితువుపలికారు. ఇటీవల సీఎం చేసిన నంది.. పంది పోలికలు ఎవరికి సరిపోతాయో తెలంగాణ ప్రజలకు అర్థమైందని వివరించారు. కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీకి వెళ్లి ఆరోపణలు చేయడం, మంత్రులపై చాడీలు చెప్పటం ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం వారికి మామూలే.. ప్రజల సమస్యలు గాలి కొదిలి ఢిల్లీ నాయకత్వానికి ముడుపులు చెల్లించడంతోనే వారికి కాలం గడిసిపోతుందని విమర్శించారు.
ఇమిగ్రేషన్ భవనంపై.. 30 అడుగుల బురద
వీపనగండ్ల: మండల కేంద్రానికి చెందిన పుట్ట శ్వేత నేపాల్‌లో మానస సరోవరం యాత్రకు వెళ్లి భారీ వరదల్లో గల్లంతయ్యారు. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాత్రకు వెళ్లిన ఆమె.. తిరుగు ప్రయాణానికి అవసరమైన అనుమతులు తీసుకునేందుకు ఇమిగ్రేషన్ భవనానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అకస్మాత్తుగా వచ్చిన వరదలతో ఐదు అంతస్తుల ఇమిగ్రేషన్ భవనం కూలిపోయిందని, భవనం చుట్టూ సుమారు 30 అడుగుల మేర బురద పేరుకుపోయినట్లు అధికారులు, సహాయక బృందాలు తెలిపాయని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్వేత కోసం గాలింపు కొనసాగుతున్నట్లు తెలిపారు. శ్వేత భర్త సురేష్‌రెడ్డి, సోదరుడు మధుసూదన్‌రెడ్డి బుధవారం నేపాల్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. శ్వేత తన కుటుంబంతో 20 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడి, అక్కడి నుంచే నేపాల్ యాత్రకు వెళ్లినట్లు వెల్లడించారు.
● నేపాల్‌లో వరదల్లో గల్లంతైన వీపనగండ్ల మహిళ
● ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు
గాలింపు


