దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధరలకు రెక్కలు వచ్చాయి. సీజన్‌లో రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు దాటని ధరలు సీజన్ ముగిసిన తర్వాత పెరగడం ప్రారంభమైంది. మే వరకు నిలకడగా ఉన్నా.. జూన్ నుంచి కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చాయి. జూలైలో రూ.3 వేల పైచిలుకు ధరలు నమోదు కాగా.. తాజాగా మరింత పెరిగి.. రూ.5,200 వరకు ఎగబాకింది. బుధవారం ఉల్లి వేలం వేయగా క్వింటాల్ ఉల్లి రూ.5,200, కనిష్టంగా రూ.3,500 వరకు పలికింది. దాదాపు వెయ్యి బస్తాల ఉల్లి అమ్మకానికి వచ్చింది. 50 కిలోల బస్తా ధర గరిష్టంగా రూ.2,600, కనిష్టంగా రూ.1,800 వరకు అమ్మకాలు సాగాయి. చిల్లరగా రూ.40 నుంచి రూ.60 వరకు అమ్మారు.
రేపు సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లాస్థాయి సబ్ జూనియర్ బాలికల సాఫ్ట్‌బా ల్ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా సాఫ్ట్‌బాల్ సంఘం అధ్యక్షుడు అమరేందర్ రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు 01.01.2012 తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు. ఎంపికల్లో పాల్గొనడానికి ఆసక్తిగల జిల్లాలోని బాలికలు ఆధార్‌కార్డు, బోనోఫైడ్ సర్టిఫికెట్ లేదా జనన ధృవీకరణ పత్రంతో హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాల కోసం సెల్ నంబర్లు 99590 16610, 99592 20075లను సంప్రదించాలని సూచించారు.
ఎకై ్సజ్ శాఖలో
భారీగా బదిలీలు
● కమిషనర్ ఆమోదంతో సీఐలు, ఎస్‌ఐలకు స్థానచలనం
నారాయణపేట: తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖలో భారీస్థాయిలో బదిలీలు చోటుచేసుకున్నాయి. సీఐ, ఎస్‌ఐ కేడర్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ బుధవారం సాయంత్రం నుంచి వరుసగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కమిషనర్ ఆమోదంతో గ్రేటర్ హైదరాబాద్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ (ఇన్‌చార్జి) హరికృష్ణ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. బదిలీ అయిన అధికారులు ప్రస్తుత పోస్టు నుంచి వెంటనే రిలీవ్ అయి, కొత్తగా కేటాయించిన స్థానాల్లో తక్షణమే విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
● ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎకై ్సజ్ పరిధిలోనూ పలువురు అధికారులకు స్థానచలనం కలిగింది. నారాయణపేట ఎకై ్సజ్ సీఐ అనంతయ్య శేరిలింగంపల్లికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నల్లగొండ డీటీఎఫ్ సీఐ సైదులు వస్తున్నారు.
● నారాయణపేట ఎకై ్సజ్ సర్కిల్ ఎస్‌ఐలు గురువయ్య దేవరకొండకు, రమేష్ కోదాడ చెక్‌పోస్టు, శిరీష తుంగతుర్తికి బదిలీ అయ్యారు. కోస్గి సీఐ బాలకృష్ణ మల్కాజ్‌గిరికి బదిలీ కాగా.. నారాయణపేట బీఎంపీపీలో పనిచేస్తున్న శ్రావణ్‌కుమార్ సైబరాబాద్ పరిధిలోని పటాన్‌చెరువుకు బదిలీ అయ్యారు.
ఉమ్మడి జిల్లాలో మరికొందరికి..
మహబూబ్‌నగర్ సీఐ లక్ష్మణ్‌గౌడ్ కుత్బుల్లాపూర్‌కు, జడ్చర్ల సీఐ విప్లవ్‌రెడ్డి దూల్‌పేట్‌కు బదిలీ అయ్యారు. నాగర్‌కర్నూల్ పరిధిలోని ఎస్‌ఐ చిన్నరాములు మోటూరి హుజూర్‌నగర్‌కు, జడ్చర్ల ఎస్‌ఐ నాగరాజు ఎన్‌ఫోర్స్‌మెంట్ మల్కాజ్‌గిరికి, కోస్గి ఎస్‌ఐ ఎంఏ జబ్బార్ హయత్‌నగర్, డీటీఎఫ్ నుంచి కవిత సంగారెడ్డికి బదిలీ అయ్యారు.
● రేవులపల్లి నుంచి జి.వెంకటేశం మహబూబ్‌నగర్ సీఐగా, జహీరాబాద్ నుంచి మల్లికార్జునబాబు వనపర్తి సీఐగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ నుంచి చంద్రశేఖర్ జడ్చర్ల సీఐగా బదిలీపై వస్తున్నారు. మెదక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నుంచి ఎస్‌ఐ యాదయ్య జడ్చర్లకు, రామపేట్ నుంచి ఎస్‌ఐ శివకృష్ణ చెక్‌పోస్టుకు, హయత్‌నగర్ నుంచి ఎస్‌ఐ సరళ కోస్గికి బదిలీ వస్తున్నారు. ఘనపూర్ నుంచి నరేష్ కేతావత్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మహబూబ్‌నగర్‌కు బదిలీపై వస్తున్నారు.


