మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పార్టీలకతీతంగా నగర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ఏనుగొండ (డివిజన్ నం.2, 6), శ్రీనివాసకాలనీ (డివిజన్ నం.7, 21), పద్మావతీకాలనీ, టీచర్స్‌కాలనీ (డివిజన్ నం.22, 44), లక్ష్మీనగర్ కాలనీ (డివిజన్ నం.20), తిమ్మసానిపల్లి, దొడ్డలోనిపల్లి (డివిజన్ నం.1, 19)లలో ఇలా తొమ్మిది చోట్ల యూఐడీఎఫ్ నిధులతో నిర్మించే యూజీడీ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం తిమ్మసానిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన ఏఐ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూజీడీ వ్యవస్థతో మురుగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమై ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య వసతులు అందుబాటులోకి వస్తాయన్నారు. నగరంలో మౌలిక వసతులను కల్పించి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సాంకేతిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు ఏఐ ల్యాబ్‌లు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఆయా కార్యక్రమాల్లో మేయర్ జి.మమత, డిప్యూటీ మేయర్ ఎం.సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్‌యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కరి అనిత, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇన్‌చార్జి గోనెల శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్‌పీ వెంకటేష్, సిరాజ్‌ఖాద్రీ, అజ్మత్‌అలీతో పాటు ఆయా డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
9 చోట్ల యూజీడీ పనులకు శంకుస్థాపన


