పనులు రద్దు కాలేదు...
దేవరకద్ర: పట్టణంలో మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణం పూర్తయితే ఉదయం, సాయంత్రం వేళల్లో కాలక్షేపం చేయడంతో పాటు కుటుంబాలతో ఆహ్లాదకరంగా గడపొచ్చనే స్థానికుల ఆశలు ఇప్పట్లో నెరవెరేలా లేవు. దేవరకద్ర పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చడానికి 2017 మే 16న అప్పటి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, ఇప్పటి ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. రూ.5.56 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించారు. జిల్లా కేంద్రంతో పాటు ఇతర నియోజకవర్గాల్లో మినీ ట్యాంక్‌బండ్ పనులు పూర్తయినా నియోజకవర్గ కేంద్రంలో మాత్రం పనులు ముందుకు సాగడం లేదు.
కేవలం 30 శాతం పనులే..
తొమ్మిదేళ్ల కాలంలో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణంలో కేవలం 30 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ప్రారంభంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్ కట్టను బలోపేతం చేసే పనులు కొంత వరకు చేశారు. రెండేళ్లు గడిచిన తర్వాత పనులు ముందుకు సాగకపోవడం, కాంట్రాక్టర్ చేతులెత్తయడంతో మొదటి కాంట్రాక్టు రద్దు చేసి రెండో కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. రెండో కాంట్రాక్టర్ ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో అఽధికార పార్టీ ఎమ్మెల్యే కావడం విశేషం. మంజూరైన నిధుల్లో రూ.1.80 కోట్ల మేరకు పనులు పూర్తి చేసినట్లు అధికారులు అంచనా వేశారు. రెండో కాంట్రాక్టర్ కూడా పనులు చేపట్టకుండా వదిలేయడంతో మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణం 9 ఏళ్లు గడిచినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మిగిలింది.
దేవరకద్ర మినీ ట్యాంక్‌బండ్ పనులు రద్దు కాలేదు. 2017లో పనులు ప్రారంభమైన సమయంలో మా సబ్ డివిజన్ కార్యాలయం లేదు. 2021లో సబ్ డివిజన్ ఏర్పాటు చేశారు. కొంత వరకు పనులు చేపట్టి కట్టను వెడల్పు చేసి బలోపేతం చేశారు. ఆ తర్వాత పనులు నిలిచిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయ పథకం కింద చేపట్టిన పనులు, ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న వాటి వివరాలను ప్రభుత్వానికి అందజేశాం. వాటిపై ప్రభుత్వ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. త్వరలో పెండింగ్ పనులను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది.
–ప్రతాప్‌సింగ్, ఈఈ, సబ్ డివిజన్ దేవరకద్ర
రూ.5.56 కోట్లతో 2017లో పనులు ప్రారంభం
9 ఏళ్లు గడిచినా పూర్తి కాని వైనం
పెండింగ్ పనుల వివరాల సేకరణలో ప్రభుత్వం


