రాజాపూర్: మండలంలోని రంగారెడ్డిగూడ వద్ద జాతీయ రహదారి పక్కన హెచ్‌పీ పెట్రోల్ పంపు సమీపంలో 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించినట్లు బుధవారం రాజాపూర్ ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్పీ జానకి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆధారాలపై పోలీసు అధికారులను ఆరా తీశారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టి మృతురాలు ఎవరనేది గుర్తించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మృతురాలిని ఎవరైనా గుర్తించినా, ఆమెకు సంబంధించిన వ్యక్తులు, ఇతర సమాచారం ఎవరికై నా తెలిస్తే వెంటనే రాజాపూర్ పోలీసులకు సెల్ నంబర్ 87126 59347, జడ్చర్ల రూరల్ సీఐ నంబర్ 87126 59315కు సమాచారం ఇవ్వాలని కోరారు.


