బెండసాగుతో అధిక లాభాలు | - | Sakshi
Sakshi News home page

బెండసాగుతో అధిక లాభాలు

Aug 20 2026 3:52 AM | Updated on Aug 20 2026 3:52 AM

మిడ్జిల్‌: తక్కువ నీరు.. తక్కువ పెట్టుబడితో 45 రోజుల్లో చేతికొచ్చే పంట బెండ. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాభావ పరిస్థితుల్లో బెండ గు రైతులకు ఎంతో అనువైందని మండల వ్యవసాయ అధికారి సిద్దార్థ అన్నారు. సరైన పద్ధతులు పాటించకపోయిన, పురుగు మందులు సకాలంలో పిచికారీ చేయని నేపథ్యంలో వైరస్‌ సోకి పంట దిగుబడి సగానికి పడిపోతుందని, రైతులు అధిక లాభాలు పొందేందుకు వ్యవసాయ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొంటున్నారు.

భూమి తయారీ :

బెండకు నల్లరేగడి, ఎర్రచల్కలు, నీరు నిల్వ ఉండని పొలం అనువైంది. ఎకరాకు 10 టన్నుల పశు వుల ఎరువు, చివరి దుక్కిలో 40 కిలోల సూపర్‌ పాస్ఫేట్‌ 10 కిలోల పొటాష్‌ వేసుకోవాలి. పొలంలో 6 అడుగులకు అడుగు లోతు కాల్వ తీయాలి.

విత్తనాల ఎంపిక :

పర్బని క్రాంతి, ఆర్కఅనామిక, వరద సు ర్వి రకాలు మన వాతవరణానికి తట్టుకుంటాయి. విత్తే ముందు కిలోకు 2 గ్రాముల కార్బిండిజమ్‌ 2 గ్రాముల థైరంతో శుద్ధిచేసుకోవాలి. ఎకరానికి 3.5 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. వరుసల మధ్య (సాళ్ల)60 సెం.మీటర్లు, మధ్య 30 సెం.మీటర్లు ఉండాలి. లోతు 2– 3 సెం.మీటర్లు ఉండాలి. గింజను ఎక్కువ లోతులో వేస్తే మొలకరాదు. వర్షం ముందు విత్తి నీరు నిలిచి గింజ కుళ్లిపోతుంది.

నీటి యాజమాన్యం :

బెండకు తక్కువ నీరు సరిపోతుంది. కానీ క్రమం తప్పకుండా తేమ ఉండాలి.

విత్తనం విత్తిన వెంటనే ఒక తడి, తర్వాత 7– 8 రో జులకు, పూత, కాయదశలో 5–6 రోజులకు ఒక సా రి తడి ఇవ్వాలి.ఎక్కువ నీరు ఇస్తే పూత రాలిపో తుంది.కరువు వస్తే కాయలు చిన్నవిగా, గరుకుగావుతా యి. డ్రిప్‌ ఇరిగేషన్‌ ఉంటే 70 శాతం ఆదా అ వుతుంది. 20 శాతం పంట దిగుబడి పెరుగుతుంది.

ఎరువుల యాజమాన్యం :

బేసల్‌ డోస్‌ తర్వాత మొదటి కలుపు సమయంలో ఎకరాకు 30 కిలోల వేసుకోవాలి. పూత మొదలైనప్పుడు మరో 20 కిలోల యూరియా 10 కిలోల పొటాష్‌ వేసుకోవాలి.

సూక్ష్మపోషకాలు:

పూతదశలో ఎకరాకు 55 గ్రాముల చిలేటేడ్‌ జింక్‌, 500 గ్రాముల బోరాన్‌ను 200 లీటర్ల నీటీతో కలిపి పిచికారీ చేస్తే పూత రాలడం తగ్గి కాయలు ఎక్కువగా వస్తాయి. ఎక్కువ నత్రజని వేస్తే కాయకంటే ఆకు ఎక్కువగా వస్తుంది.

కలుపు యాజమాన్యం:

పంటలో మొదటి 30– 40 రోజులు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 20, 40 రోజులకు రెండుసార్లు కలుపు తీయాలి. ప్రత్యామ్నాయంగా విత్తిన మూడు రోజుల్లో ఎకరాకు 88 మి.లీటర్ల పెండిమిథలిన్‌ 200 లీటర్లతో కలిపి పిచికారీ చేస్తే కలుపు రాదు.

పురుగులు, నివారణ:

చెన్నపురుగు: ఆకులను అంచుల నుంచి తినేయడం. నివారణ: కిలోకు 5 కిలోల వేప గింజల కషాయం పిచికారీ చేయాలి. తీవ్రంగా ఉంటే 2 మి.లీ. ప్రొఫెనోఫాస్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

ప్రూట్‌ బోరర్‌: కాయలో రంధ్రం చేసి గుజ్జును తినడం. నివారణకు దెబ్బతిన్న కాయలను కోసి పూడ్చివేయాలి, 2 మి.లీటర్లు క్లోరాంట్రానిలిప్రోల్‌ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కోతకు ఏడు రోజుల ముందు ఏ రసాయన మందు పిచికా రీ చేసిన మార్కెట్‌లో కాయలు నిల్వ ఉండవు.

తెగుళ్లు, నివారణ:

పసుపు నరాల మొజాయిక్‌ వైరస్‌:

ఇది బెండలో అతిపెద్ద శుత్రువు. తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. ఆకుల నరాలు పసుపుగా మారి మొక్క ఎదుగుల ఆగిపోతుంది. నివారణకు ఎల్లోవీన్‌ మోసాయిక్‌ వైరస్‌ నిరోధక రకాలు వేయాలి. విత్తిన 20 రోజుల నుంచి 10 రోజులకు ఒకసారి వేపనూనె కొట్టాలి. తెగులు వచ్చిన మొక్కలను వెంటనే పీకి పారేయాలి.

బూడిద తెగులు: ఆకులపై తెల్లని పొడి ఉంటే నివారణకు 2 గ్రాముల సల్ఫర్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి.

దిగుబడి: మంచి యాజమాన్య పద్ధతులు, వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తే ఎకరాకు 80 నుంచి 100 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. దీంతో అధిక లాభాలు పొందవచ్చు.

పాడి–పంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement