కార్గో సేవలు పునఃప్రారంభం | - | Sakshi
Sakshi News home page

కార్గో సేవలు పునఃప్రారంభం

Aug 20 2026 3:52 AM | Updated on Aug 20 2026 3:52 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: నగరంలోని ఆర్టీసీ కొత్త బస్టాండులో ఎట్టకేలకు కార్గో సేవలు పునఃప్రారంభమయ్యాయి. వాస్తవానికి ఈ నెల 1 నుంచి ఈ సేవలు నిలిచిపోవడంతో వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఓ ప్రైవేట్‌ సంస్థ అన్ని బస్టాండ్లలో కార్గో ద్వారా సరుకుల రవాణాకు ఈసారి టెండరు దక్కించుకుంది. అయితే పది రోజులైనా మహబూబ్‌నగర్‌లో ఏజెన్సీ నిర్వహణ బాధ్యతలు చేపట్టకపోవడంతో ఆర్టీసీ ద్వారా సరుకుల బుకింగ్‌కు ఆస్కారం లేకుండాపోయింది. ఇదే విషయమై ‘నిలిచిపోయిన కార్గో సేవలు’ శీర్షికన ఈ నెల 11న ‘సాక్షిశ్రీలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనికి ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత ఏజెన్సీతో మాట్లాడి తిరిగి ఇప్పుడు కార్గో సేవలను అందుబాటులోకి తెచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement