చిరుత కళేబరానికి పోస్టుమార్టం | - | Sakshi
Sakshi News home page

చిరుత కళేబరానికి పోస్టుమార్టం

Aug 18 2026 7:40 AM | Updated on Aug 18 2026 7:40 AM

మన్ననూర్‌:శ్రీశైలం–హైదరాబాద్‌ ప్రధాన జాతీయ రహదారి 765లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిరుత పులి కూనకు ఎన్‌టీసీఏ మార్గదర్శకాల ప్రకారం శాసీ్త్రయ పద్ధతిలో సోమవారం పోస్టుమార్టం నిర్వహించినట్లు డీఎఫ్‌ఓ రేవంత్‌చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా అమ్రాబాద్‌ పశు వైద్యాఽ దికారి రాజు నేతృత్వంలో పోస్టుమార్టం నిర్వ హించి ప్రమాదంలో తగిలిన గాయాలు, మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు అవయవాలను పరీక్షించారు. చిరుత గోర్లు, చర్మం, దంతాలు తది తర విడి భాగాలు ఆక్రమణకు గురి కాకుండా ఉండేందుకు మృతదేహాన్ని దహనం చేశామని అధికారులు పేర్కొన్నారు. చిరుత పులి మృతి ఘటనలో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తామన్నారు.

రహదారిలో ప్రత్యేక నిఘా

ఎన్‌టీసీఏ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఇప్పటికే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కొంతకాలంగా ఎన్‌హెచ్‌ 765పై వాహనాల రాకపోకలు పెరగడంతో మన్ననూర్‌ నుంచి బ్రహ్మగిరి పరిసర ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీన్ని దృష్టి ఉంచుకొని వాహనాల వేగాన్ని నియంత్రించడంతో పాటు వన్యప్రాణుల రక్షణకు అవసరమైన ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటామని డీఎఫ్‌ఓ తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్‌డీఓ చంద్రప్రకాష్‌ సింగాల్‌, ఎఫ్‌ఆర్‌ఓలు సవిత, వీరేష్‌, ఎఫ్‌ఎస్‌ఓ సురేందర్‌, బీఎఫ్‌ఓ గోపాల్‌, ఎన్‌టీసీఏ ప్రతినిధి రవికాంత్‌, బాపిరెడ్డి, అఖిల్‌గౌడ్‌, రిస్క్యూ టీం, వాచర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement