మహనీయుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మహనీయుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

Aug 18 2026 7:40 AM | Updated on Aug 18 2026 7:40 AM

విద్యుత్‌ భవన్‌లో ఫూలే,

అంబేద్కర్‌ విగ్రహాల ఆవిష్కరణ

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): మఽహనీయులైన మహాత్మ జ్యోతిబా పూలే, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జీవితాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని నాగర్‌ కర్నూల్‌ ఎంపీ మల్లు రవి అన్నారు. తెలంగాణ విద్యుత్‌ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక విద్యుత్‌ భవన్‌న్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలను ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంతటి గొప్ప కార్యక్రమంలో భాగస్వామి కావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వంటి మహానీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ పూలే, అంబేడ్కర్‌ చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, ముఖ్యంగా విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఓబేదుల్లా కొత్వాల్‌, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌, ఎస్‌ఈ బీమా నాయక్‌, ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శ్యాం మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement