లంబడా తెగ గిరిజనులకు ఏడుగురు సీ్త్ర దేవతలు ఉన్నారు. మెరామ, హింగళ, తుల్జా, కేంకాళి, తీజ్, మత్రాళ్, సీత్త అనేవి దేవతల పేర్లు మీదుగా నిర్వహించే ప్రధాన పండుగలు. మెరామ దేవత తండాను రక్షిస్తే, తీజ్ దేవత పంటలను కాపాడుతుందని నమ్ముతారు. సీత్త దేవత పశు సంపదను వృద్ధి చేస్తుందని, మత్రాళ్ దేవత పిల్లలు అంటువ్యాధులబారిన పండకుండా రక్షిస్తుందని విశ్వసిస్తారు. వివిధ ప్రాంతాల్లో ఉండే బంధువులంతా పండుగల సందర్భంగా కలుసుకొని అత్మీయత, అనురాగాలను పంచుకుంటారు. యుక్త వయస్సున్న గిరిజన యువతులు విద్యా, ఉద్యోగ, సంసారిక జీవితంతోపాటు పుట్టినింటితోపాటు మొట్టినిల్లు కూడా అష్టైశ్వర్యాలు, సుఖశాంతులతో తులతూగాలని ప్రతిఏటా మొలకల పండుగను నిర్వహిస్తారు. తరతరాల నుంచి గిరిజన తండాల్లో గిరిజనులు జరుపుకొనే పండుగలలో ఇది ముఖ్యమైంది. పుట్టిన ప్రతి గిరిజన యువతికి పెళ్లి జరిగే నాటికి తీజ్‌ను ఆ కుటుంబ సభ్యులు నిర్వహించడం ఆనవాయితీ.


