మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న ఓపెన్ టు ఆల్ ఉమ్మడి జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ శనివారం ఉత్సాహంగా ప్రారంభమైంది. డబుల్స్ విభాగంలో మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్యాంసుందర్‌గౌడ్ టాస్ వేసి మ్యాచ్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ టోర్నీలో క్రీడాకారులు ప్రతిభచాటా లని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్.రవికుమార్, సాదత్‌ఖాన్, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అవినీతికి పాల్పడితే సహించేది లేదు
● ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
జడ్చర్ల: ప్రభుత్వ కార్యాలయాలకు సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తహసీల్దార్ కార్యాలయంతో పాటు ఇతర శాఖల్లో అవినీతికి పాల్పడుతున్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు తమ సమస్యలను క్యాంపు కార్యాలయంలోని సిబ్బంది దృష్టికి తీసుకువస్తే ఎలాంటి ఖర్చు లేకుండా పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. మాచారం సమీపంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని సర్వే చేసి ఏర్పాటు చేసిన కంచెను కొందరు ధ్వంసం చేశారని, తప్పుడు రికార్డులతో కోర్టులను ఆశ్రయించి భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి చెందిన 23 ఎకరాలను స్వాధీనం చేసుకుని అక్కడ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నా రు. ఉదండాపూర్ ఆర్‌అండ్‌ఆర్ భూసేకరణలో అక్రమాలు జరిగినట్లు విచారణలో తేలిందని, పరిహారం రికవరీతో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
అవినీతిపై మాట్లాడితే తప్పేంటి?
ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అవినీతిపై మాట్లాడుతున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని అనిరుధ్‌రెడ్డి అన్నారు. అవినీతికి పాల్పడే అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారని పేర్కొన్నారు.
సమష్టి కృషితో నాలుగో యూనిట్ పునరుద్ధరణ
మన్ననూరు: సమష్టి కృషితో శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ కేంద్రంలోని నాలుగో యూనిట్‌ను పునరుద్ధరించగలిగామని కేంద్రం ఇన్‌చార్జి సీఈ ఆదినారాయణ పేర్కొన్నారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈగలపెంటలోని కేంద్రం సీఈ పరిపాలన భవనం శ్రీశక్తి సదన్ వద్ద జాతీయ జెండాను ఎగురవేసి ఇంజినీర్లు, ఉద్యోగులు, ఆర్టిజన్లను ఉద్దేశించి మాట్లాడారు. నాలుగో యూనిట్ పునరుద్ధరించి గ్రిడ్‌కు అనుసంధానం చేశామన్నారు. ప్రస్తుతం కేంద్రంలో ఆరు యూనిట్లు విజయవంతంగా విద్యుదుత్పత్తి చేస్తున్నాయన్నారు. ఈ పునరుద్ధరణ కార్యక్రమంలో హైదరాబాద్ విద్యుత్ సౌధ అధికారులు, విధుల్లో ఉన్న ఇంజినీర్లు, అందరి సహకారంతోనే సాధ్యమైందన్నారు. ప్రస్తుతం మన ధ్యేయం కేంద్రంలో విద్యుదుత్పత్తి విజయవంతంగా చేస్తూ రాష్ట్ర గ్రిడ్‌కు అన్నివేళలా విద్యుత్ సరఫరాను అందుబాటులో ఉంచుతూ కొరత లేకుండా కృషి చేయాలన్నారు. అనంతరం కేంద్రం రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్ ఆర్‌ఐబీ రవి పర్యవేక్షణలో ఎస్‌పీఎఫ్ పోలీసుల నుంచి వందనస్వీకారం చేశారు. ఎస్‌పీఎఫ్, ఎస్‌ఐలు అనూప్, శ్రావణ్ పాల్గొన్నారు.


