నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలో రూ.511 కోట్ల అంచనా వ్యయంతో 10,216 ఇళ్లు మంజూరు కాగా, 8,955 ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో 1,219 ఇళ్లు బేస్‌మెంట్ స్థాయిలో, 640 గోడల స్థాయిలో, 3,040 స్లాబ్ స్థాయిలో ఉన్నాయి. మరో 2,937 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. పూర్తయిన ఇళ్లకు సంబంధించి రూ.223.96 కోట్ల నిధులు విడుదల చేశాం. రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి మరో 1,500 ఇళ్లు మంజూరు చేయడంతో పాటు మరో 500 ఇళ్లకు పైకప్పు మార్చుకునే అవకాశం కల్పించాం. మిడ్జిల్‌లో ఇటీవల జరిగిన కార్యక్రమంలో 24 గ్రామ పంచాయతీలకు ఎస్‌డీఎఫ్ నిధుల కింద రూ.50 లక్షల చొప్పున మొత్తం రూ.12 కోట్లకు ప్రభుత్వం జీవో జారీ చేసింది.


