యువత చైతన్యంతో ముందుకు రావాలి | - | Sakshi
Sakshi News home page

యువత చైతన్యంతో ముందుకు రావాలి

Aug 15 2026 1:33 AM | Updated on Aug 15 2026 1:33 AM

మాజంలో అవినీతి పెరిగిపోవడం వల్ల అట్టడుగు వర్గాల ప్రజలు పేదరికంలోనే ఉండిపోతున్నారు. అక్రమ మార్గాల్లో సంపాదించే వారు ధనవంతులవుతుంటే.. పేదలు మాత్రం వెనుకబడిపోతున్నారు. అవినీతిని అంతమొందించేందుకు యువత చైతన్యంతో ముందుకు రావాలి. బాధ్యతాయుతమైన యువతను తయారు చేసినప్పుడే సమసమాజం ఏర్పడుతుంది. విద్య, ఉద్యోగాల్లో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది.

– కె.జగదీశ్వర్‌రెడ్డి, డిగ్రీ విద్యార్థి,

ఎంవీఎస్‌ కళాశాల

అవినీతిని అంతం చేస్తేనే..

దేశానికి స్వాతంత్రం సిద్ధించి 80 ఏళ్లు అవుతోంది. దేశం మెల్లమెల్లగా అభివృద్ధి దిశగా పయనిస్తుంది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశంగా వెలుగొందుతోంది. ముఖ్యంగా దేశ జనాభాలో ఎక్కువశాతం ఉన్న యువతను దృష్టిలో పెట్టుకొని వారి ఆర్థికస్వావలంబనకు అనేక పథకాలు రూపొందించాలి. అన్నింటా అవినీతి రాజ్యమేలుతోంది. దీన్ని అంతం చేస్తే దేశాభివృద్ధి సుసాధ్యమే. విద్యకు,. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి వాటికి బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించాలి.

– పి.రమేష్‌చందర్‌, రిటైర్డ్‌ డీడీ,

వయోజన విద్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement