స్టేషన్ మహబూబ్‌నగర్: నగరానికి ముఖద్వారం తూర్పు కమాన్. అప్పటి లోకాయపల్లి సంస్థానాధీశులు నాలుగు కమాన్‌లు కట్టారు. దీంట్లో ఒకటి తూర్పు కమాన్.. ఇది అనేక ఉద్యమాలకు సాక్షిగా నిలిచింది. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనరాదని, పత్రికలు చదవడం, రేడియో వినడం చేయకూడదని అప్పట్లో నిజాం నవాబు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో 1947, ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి దేశానికి స్వాతంత్య్రం రాగా... ఆ మరుసటి రోజు అర్ధరాత్రి శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయం పక్కన గల తూర్పు కమాన్‌పై భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్య్ర ఉద్యమకారులు విరివింటి లక్ష్మణమూర్తి, పద్మయ్య ఆనాటి నిజాం పాలకులకు సవాలు విసిరారు. 1927లో పాలమూరులో ‘శ్రీ సీతారామాంజనేయ బాల భక్త సమాజాన్ని’ నెలకొల్పడంతో జిల్లాలో గ్రంథాలయ ఉద్యమం ఊపందుకుంది. ఈ సంస్థ వందలాది మంది కార్యకర్తలను తయారు చేసింది.
దేశభక్తికి స్ఫూర్తి.. దశాబ్దాల ఘన కీర్తి


