జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం జరిగే జాతీయ పతాకాన్ని ఎగురవేసే వారి పేర్లను గురువారం ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉమ్మడి పాలమూరు పరిధిలోని మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నారాయణపేటలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖమంత్రి వాకిటి శ్రీహరి, నాగర్‌కర్నూల్‌లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, జోగుళాంబ గద్వాలలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, వనపర్తిలో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పట్నం మహేందర్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అలాగే ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు.
సీజనల్ వ్యాధుల కట్టడికి చర్యలు చేపట్టాలి
పాలమూరు: కోయిలకొండ మండల పరిధిలో ఉన్న బూర్గుపల్లి, పారుపల్లి గ్రామాల్లో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాలను గురువారం డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉప కేంద్రాల పరిధిలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. గ్రామాల్లో ఇంటి పరిసరాలు, ఆవరణంలో కూడా పరిశుభ్రంగా పెట్టుకోవడం, దోమల వల్ల వచ్చే వ్యాధులను కట్టడిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ శంకర్, డాక్టర్ శివకాంత్, సుభాష్‌చంద్ర పాల్గొన్నారు.
కేజీబీవీల్లో సివిల్ పనులు వేగవంతం చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలోని క స్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో చేప డుతున్న సివిల్ పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ అన్నారు. గురువారం తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న సివిల్ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పనులు ఆలస్యం కాకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి, నిర్దేశిత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.


