● విశేషోత్సవాలు ప్రారంభం.. సెప్టెంబర్ 16 వరకు వేడుకలు
● ప్రతిరోజూ శాంతిహోమం, వేయి తులసి దళాలతో అర్చన
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శ్రావణమాస విశేషోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 16 వరకు నెల రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఇందుకోసం దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రావణమాసం సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, శాంతిహోమం, వేయి తులసి దళాలతో అర్చన నిర్వహించనున్నారు. విశేషోత్సవాల్లో భాగంగా స్వామివారికి స్వర్ణాభరణ అలంకరణ చేసి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు. ప్రతి బుధ, గురు, శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు.. ప్రతి శనివారం రాత్రి శేషవాహన సేవ నిర్వహించనున్నారు.


