జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): యాసంగి 2024–25 సీజన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ డెలివరీని ఆగస్టు 31లోగా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్‌బీ హరిప్రియ మిల్లర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పెండింగ్ సీఎంఆర్‌పై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 95 శాతం సీఎంఆర్ డెలివరీ పూర్తికాగా.. మిగిలిన 5 శాతం తొమ్మిదిమంది బాయిల్డ్ రైస్ మిల్లర్ల వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిల్లర్లు తమ సామర్థ్యానికి అనుగుణంగా రోజుకు రెండు షిఫ్టుల్లో మిల్లింగ్ నిర్వహించి.. పెండింగ్ సీఎంఆర్‌ను డెలివరీ చేయాలని సూచించారు. బాయిల్డ్ రైస్‌కు బదులుగా రా రైస్ టార్గెట్ కేటాయిస్తే గడువులోగా సీఎంఆర్ పూర్తి చేస్తామని కొందరు మిల్లర్లు సమావేశంలో కోరారు. అయితే జిల్లాకు ప్రస్తుతం రా రైస్ టార్గెట్ మాత్రమే కేటాయించారని.. బాయిల్డ్ రైస్ టార్గెట్ ఇచ్చే అవకాశం లేదని కమిషనర్ కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లు అధికారులు వివరించారు. పెండింగ్ సీఎంఆర్ డెలివరీలో ఎలాంటి జాప్యం చేయకుండా ఆగస్టు 31లోగా మొత్తం డెలివరీ పూర్తి చేసి డిఫాల్ట్ కాకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, డీఎం రవినాయక్, డీటీలు, సంబంధిత రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.


