సమాఖ్య భవనాలను వెంటనే పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

సమాఖ్య భవనాలను వెంటనే పూర్తి చేయాలి

Aug 12 2026 1:04 AM | Updated on Aug 12 2026 1:04 AM

దామరగిద్ద: కొత్తగా నిర్మిస్తున్న మహిళా సమాఖ్య భవనాలను 20రోజుల్లో పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్‌ సీఎచ్‌ ప్రియాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల మహిళా సమాఖ భవనం సమీపంలో కొనసాగుతున్న సీతాఫల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ సదుపాయాలపై ఆరా తీశారు. 2019 నుంచి మండలంలో సీతాఫల్‌ ప్రాసెసింగ్‌ను కొసాగిస్తున్నట్లు డీపీఎం జయన్న కలెక్టర్‌కు వివరించారు. యూనిట్‌ ద్వారా వచ్చిన లాభాలను మహిళలకు కల్పించిన ఉపాధి అవకాశాన్ని తెలియజేశారు. ఈ ఏడాది ప్రాసెసింగ్‌ను కొనసాగించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న భవనంలో ప్రాసెసింగ్‌ చేసేందుకు స్థలం సరిపోవడంతో లేదని, సీతాఫల్‌, వేరుశనగ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు ప్రత్యేక స్థలం కేటాయించాలని సమాఖ్య సభ్యులు కలెక్టర్‌ దృష్టితి తీసుకురాగా, గోడౌన్‌ ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని తహసీల్దార్‌ తిరుపతయ్యను ఆదేశించారు. కంసాన్‌పల్లిలోని ప్రభుత్వ భూమిని గుర్తించినట్లు తహసీల్దార్‌ కలెక్టర్‌కు వివరించారు. మహిళా స్వయం సహాయక సంఘాల నిర్వహణ, బ్యాంకు రుణాలు, ఎన్‌పీఏ, కిశోర బాలికల సంఘాల ఏర్పాటుపై ఆరా తీశారు. అనంతరం అయ్యవారిపల్లిలో నిర్మిస్తున్న వీఓ భవనాన్ని పరిశీలించారు. మండలంలో కొత్తగా నిర్మిస్తున్న వీఓ భవనాలను మై వన్‌ సాంకేతికతను ఉపయోగించి త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట డీఆర్‌డీఓ వెంకట్రాములు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతి, ఎంపీడీఓ సాయిలక్ష్మి తహసీల్దార్‌ తిరుపతయ్య, సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు, ఏపీఎం ఆంజనేయులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement