జిల్లాలో 17,348 మంది మృతి చెందినట్లు బీఎల్‌ఓల పరిశీలనలో తేలింది. 55,086 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, 14,372 మంది ఇప్పటికే మరోచోట ఎన్‌రోల్ అయినట్లు గుర్తించారు. మరో 15,396 మంది అబ్‌సెంట్‌గా ఉండగా.. 884 మంది ఎన్యూమరేషన్‌కు నిరాకరించినట్లు అధికారులు గుర్తించారు. కొందరికి స్వగ్రామంలో ఓటు ఉండగా.. ఉద్యోగం, వ్యాపారం చేస్తున్న ప్రాంతాల్లోనూ ఓటు నమోదైంది. మరికొందరి ఓట్లు హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లు తేలింది. ఇలాంటి ఓట్లను పరిశీలించి డబుల్ ఎంట్రీలను తొలగించే ప్రక్రియ చేపట్టనున్నారు.


