కార్పొరేట్ల లబ్ధి కోసమే పాలన: సీపీఐ | - | Sakshi
Sakshi News home page

కార్పొరేట్ల లబ్ధి కోసమే పాలన: సీపీఐ

Aug 12 2026 12:58 AM | Updated on Aug 12 2026 12:58 AM

హన్వాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్‌ విమర్శించారు. ‘బద్లావ్‌ జరూరి హై–మార్పు కావాలి’ నినాదంతో సీపీఐ చేపట్టిన జన చైతన్య యాత్ర మంగళవారం హన్వాడలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం, ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడం, కార్మిక హక్కులను హరించేలా లేబర్‌ కోడ్‌లను అమలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని ఆరోపించారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు అందే వరకు సీపీఐ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి శంకర్‌నాయక్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు రాము, చాంద్‌పాష, పద్మ, ఇందిరా, మహేష్‌బాబు, సత్యనారాయణరెడ్డి, శంకర్‌నాయక్‌, భీమయ్య, రెహమాన్‌, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement