సకల హంగులతో ట్యాంక్‌బండ్‌ను నిర్మించ తలపెట్టిన ట్యాంక్‌బండ్ సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పూర్తి కాలేని పరిస్థితి. అయితే గతంలో ట్యాంక్‌బండ్ ప్రారంభం సందర్భంగా ప్రభుత్వం నీటిలో బోటింగ్ చేసేందుకు వీలుగా రూ.లక్షలు వెచ్చించి బోట్లను కొనుగోలు చేశారు. ఇందు ఒక పెద్ద బోటు, చిన్నబోట్లు ఉన్నాయి. ట్యాంక్‌బండ్ పనులు మరోసారి ప్రారంభమైన సందర్భంగా బోట్‌లను కట్టకింద భాగంలో వేశారు. ఇప్పటికీ రెండేళ్లు గడిచిపోయాయి. దీంతో బోట్లు విరిగిపోవడం, చెట్లు మొలవడం వంటివి జరిగాయి. ప్రస్తుతం భారీగా చెట్లు మెలిచి బోట్లు పాడైపోయాయి. ఈ క్రమంలో అధికారుల తీరుపై పట్టణ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లక్షలు పెట్టి కొనుగోలు చేసిన బోట్లను చెట్లపాలు చేశారని వాటిని పాడవకుండా సురక్షిత ప్రదేశానికి తరలించాలని కోరుతున్నారు. మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్


