● 4 రోజుల క్రితం గర్భిణి
ఆత్మహత్యాయత్నం
● చికిత్స పొందుతూనే మగ శిశువుకు జననం
ఊట్కూర్: కుటుంబ సభ్యుల వేధింపులతో మనస్థాపానికి గురై నాలుగు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలింత లావణ్య (23) మృతి చెందిన ఘటన ఆదివారం మండలంలోని పెద్దజట్రం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. నా రాయణపేట మండలంలోని బొమ్మన్‌పాడుకు చెందిన లావణ్యకు పెద్దజట్రం గ్రామానికి చెందిన తా యప్ప కుమారుడు బాలకృష్ణతో నాలుగేళ్ల క్రితం వి వాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమార్తె ఉండ గా.. ప్రస్తుతం ఆమె గర్భిణి. ఈ క్రమంలో 15 రోజు ల క్రితం భర్త బాలకృష్ణ, కుటుంబ సభ్యులు ఆమెకు తెలియకుండా ఇతరులకు భూమి అమ్మారు. ఈ విషయమై కుటుంబంలో గొడ వలు జరుగుతున్నాయి. దీంతో మనస్థాపానికి గురైన లావణ్య ఈ నెల 4, మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంచుకుంది. మంట వేడికి బాధితురాలు కేకలు వేయడంతో గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు కలిసి మంటలు ఆర్పి చికిత్స కోసం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మగ శిశువుకు జన్మనిచ్చింది. శిశువు పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఇరువురు చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. తహసీల్దార్ అశోక్‌కుమార్ పంచనామా నిర్వహించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేశ్ తెలిపారు.


