ఎర్రవల్లి: అలంపూర్ మండలంలోని సుల్తానాపురంలో తనిఖీల్లో పోలీసులు 1.30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, ఒకరిని అరెస్ట్ చేయగా, మరో ముగ్గరు నిందితులు పరారీలో ఉన్నట్లు అలంపూర్ సీఐ ప్రదీప్‌కుమార్ తెలిపారు. ఆదివారం కోదండాపురంలోని సీఐ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన చంద్రకాంత్‌గౌడ్‌ను అరెస్టు చేసి గంజాయితో పాటు డిజిటల్ వేయింగ్ మిషన్, ప్లాస్టిక్ బాటిల్, స్ట్రా, ప్యాకింగ్‌కు వినియోగించిన బ్రౌన్‌కలర్ ప్లాస్టర్, లావా కీపాడ్ మొబైల్ ఫోన్‌ను స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో అలంపూర్ ఎస్‌ఐ రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.


