వాతావరణ మార్పులతో ఒక్కసారిగా చిన్నారుల్లో జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు పెరిగాయి. ఈ కాలంలో డిఫ్తీరియా వచ్చే అవకాశాలు ఎక్కువ. పరిసరాల పరిశుభ్రత పాటించాలి. ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినాలి. ఆహార పదార్థాలపై ఈగలు, దోమలు వాలకుండా చూసుకోవాలి. ఇంటి చుట్టూ వర్షపు నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి. జ్వరం, జలుబు వస్తే పిల్లలకు యాంటీబయోటిక్స్ ఇవ్వకూడదు. వైద్యుల సూచన మేరకే మందులు వేసుకోవాలి.
– రాఘవేందర్, చిన్నపిల్లల వైద్యుడు
జిల్లాలో సీజనల్ వ్యాధులను అరికట్టడానికి ప్రతి శుక్రవారం ఫ్రై డే– డ్రై డే నిర్వహిస్తున్నాం. కేసులు నమోదవుతున్న గ్రామాల్లో ఇంటింటికి తిరిగి సర్వే చేసి రక్త నమూనాలు సేకరిస్తున్నాం. అంగన్‌వాడీలు, ఆశలు, ఏఎన్‌ఎంల ద్వారా ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నాం. ప్రధానంగా గ్రామాలు, పట్టణాల్లో ఇళ్ల మధ్య నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి. దీంతో ఇంట్లో ఉండే పరిసరాలు చాలా శుభ్రంగా పెట్టుకోవాలి. జ్వరం, దగ్గు, జలు బు ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్లు ప్రైవేట్‌కు కాకుండా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలి.
– శ్రీనివాసులు, డీఎంహెచ్‌ఓ
●


