గండేడ్‌లోని సమాఖ్య భవనంలో కొనసాగుతున్న రొట్టెల తయారీ యూనిట్‌లో ఉత్పత్తి క్రమంగా పెరుగుతోంది. తొలినాళ్లలో రోజుకు 100 నుంచి 500 రొట్టెల వరకు మా త్రమే తయారు చేసేవారు. ప్రస్తుతం వీటికి ఆదరణ పెరగడంతో రోజుకు 1,000 నుంచి 1,500 రొట్టెల వరకు తయారు చేస్తున్నారు. ఒక్కో రొట్టెను రూ.5 చొప్పున విక్రయిస్తున్నారు. సల్కర్‌పేట్, వెన్నాచేడ్, అంచన్‌పల్లి, గండేడ్ తదితర గ్రామాల్లోని హోటళ్లు, దాబాలు, కిరాణా దుకాణాలకు వీటిని సరఫరా చేస్తున్నారు. అంతేకాకుండా మహమ్మదాబాద్, కోస్గి, హన్వాడ మండలాలకు కూడా ఇక్కడి నుంచే రొట్టెలను పంపిస్తున్నారు.
ఆరబెట్టిన రొట్టెలు


