మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ఈ యూనిట్ ద్వారా మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు వారి ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తున్నాం. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మిగతా ఎనిమిది రకాల యంత్రాలను కూడా పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు చేపడతాం. రొట్టెల తయారీతో పాటు బిస్కెట్లు, ఆరికలు, ఊదలు, కొర్రలు తదితర చిరుధాన్యాల ఉత్పత్తుల తయారీకి సంబంధించిన యంత్రాలు పనిచేసేలా చూస్తాం. మిల్లెట్ యూనిట్ ఏర్పాటు చేసిన లక్ష్యాలు నెరవేరేలా అన్ని విభాగాలను పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు కృషి చేస్తాం. గండేడ్ మిల్లెట్ యూనిట్‌ను మహిళల ఆర్థిక స్వావలంబనకు ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. – రజిత, ఏపీఎం, గండేడ్


